Begin typing your search above and press return to search.

బాయ్స్ హాస్టల్ కోసం బై 1 గెట్ 1

దీంతో యూత్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం ఇప్పుడు చిత్ర నిర్మాతలు కొత్త ఆఫర్ ని తీసుకొని వచ్చారు. బై వన్ గెట్ వన్ టికెట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:48 AM GMT
బాయ్స్ హాస్టల్ కోసం బై 1 గెట్ 1
X

కన్నడంలో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే. ఈ మూవీ కన్నడంలో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ముఖ్యంగా యువతకి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ చిత్రాన్ని చాయ్ బిస్కెట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా తెలుగులో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్ అయ్యింది.

అయితే తెలుగులో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. బేబీ సినిమా ఈ ఏడాది యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో బాయ్స్ హాస్టల్ కూడా అలాగే చేరువ అవుతుందని భావించి తెలుగులో పక్కా నేటివిటీ టచ్ ఇస్తూ డబ్బింగ్ చేయించి రిలీజ్ చేశారు. అయితే యూత్ నుంచి వారు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే చెప్పాలి. పర్వాలేదని టాక్ మాత్రమే వస్తోంది.

దీంతో యూత్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం ఇప్పుడు చిత్ర నిర్మాతలు కొత్త ఆఫర్ ని తీసుకొని వచ్చారు. బై వన్ గెట్ వన్ టికెట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. చిత్ర నిర్మాత శరత్ చంద్ర తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బాయ్స్ హాస్టల్ సినిమాపై ఈ ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే మూవీ చూసిన తర్వాత ఎవరైన నచ్చలేదు అంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.

ప్రతి ఒక్కరికి ఈ మూవీ కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ఆఫర్ గురువారం మాత్రమే ఉంటుందని అఫీషియల్ గా పోస్టర్స్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. పోస్టర్ లో ఏ థియేటర్స్ లో బై 1 గెట్ 1 ఆఫర్ ఉంటుందనేది కూడా రాశారు. ఆఫర్ కేవలం స్టూడెంట్స్ కి మాత్రమే అని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం విశేషం.

ఈ సినిమా నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కింది. కాంతారాకి మ్యూజిక్ అందించిన అంజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు. మంజునాథ్ నాయక, ప్రజ్వల్ బిపి, శ్రీవత్స శ్యామ్, గగన్ రామ్, శ్రేయాస్ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా ఎక్కువ మంది యూత్ కి చేరువ చేయాలని నిర్మాతలు చేస్తోన్న ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందనేది చూడాలి.