Begin typing your search above and press return to search.

ముదురు భామ‌తో కుర్ర హీరో రొమాన్స్!

10-15 ఏళ్లు వ‌య‌సుతో తేడా ఉన్న భామ‌ల‌తోనే కుర్ర హీరోలు రియ‌ల్ రొమాన్స్ న‌డిపిస్తున్నారు. మ‌లైకా అరోరా...అర్జున్ క‌పూర్ లా.

By:  Tupaki Desk   |   2 Nov 2023 8:40 AM GMT
ముదురు భామ‌తో కుర్ర హీరో రొమాన్స్!
X

హిట్ కాంబినేష‌న్స్ అయితే! హీరో-హీరోయిన్ల మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం అన్న‌ది పెద్ద‌గా హైలైట్ అవ్వ‌దు. అప్ప‌టికే ప్రేక్ష‌కులు ఆజోడీని తె ర‌పై చూడ‌టంతో పాటు హిట్ మోజులో! ఆ వ్యత్యాసం క‌నిపించ‌దు. మ‌రి ఫెయిలైతే ఎలాంటి సన్నివేశం ఉంటుందో ? తెలిసిందే. ర‌క‌రకాల విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొంత మంది మేక‌ర్స్ వీలైనేంత వ‌ర‌కూ ఆ వ్య‌త్యాసం రాకుండా కాంబినేష‌న్లు సెట్ చేస్తుంటారు.

సూప‌ర్ క్రేజ్ ఉన్న భామ‌ల‌కు కొంత మిన‌హాయింపు ఉంటుంది! త‌ప్ప‌! కొత్త భామ‌ల జోలికైతే అస్స‌లు వెళ్ల‌రు. యంగ్ హీరోల వ‌య‌సుకు త‌గ్గ హీరోయిన్ల‌నే ఎంపిక చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ కుర్ర హీరో ఇషాన్ క‌ట్ట‌ర్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్ చేస్తున్న సంగ‌తి నెట్టింట వైర‌ల్ గా మారింది. నిజానికి ఈ కాంబినేష‌న్ సెట్ అయి కొన్ని నెల‌లు అవుతున్నా! రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డే స‌రికి వ్య‌త్యాసం గుర్తొస్తుంది.

ప్ర‌స్తుతం ఇద్ద‌రు జంట‌గా `పిప్పా` అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ వార్ డ్రామా చిత్రాన్ని రాజాకృష్ణ మీన‌న్ తెర‌కెక్కిస్తున్నారు. బ్రిగేడియ‌ర్ బ‌ల‌రాం సింగ్ జీవిత క‌థ ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ‌యోపిక్ కావ‌డంతో? ఇషాన్..మృణాల్ మ‌ధ్య రొమాన్స్ పెద్ద‌గా హైలైట్ కాలేదు. అయితే సినిమాలో కావాల్సినంత రొమాన్స్ కూడా ఉంద‌ని తెలుస్తోంది.

ఇద్ద‌రి వయ‌సు వ్య‌త్యాసం కూడా ఉంది. ఇషాన్ క‌ట్ట‌ర్ వ‌య‌సె 28 ఏళ్లు కాగా..మృణాల్ ఠాకూర్ ఏజ్ 31. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మూడేళ్లు వ్య‌త్యాసం ఉన్న‌ట్లు చెప్పొచ్చు. అయితే ఇదేమి పెద్ద గ్యాప్ కాదు. అంత‌గా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చే అవ‌కాశం లేదు. సినిమా ఎలా ఉన్నా ఆమోద‌యోగ్యంగానే ఉంటుంది. 10-15 ఏళ్లు వ‌య‌సుతో తేడా ఉన్న భామ‌ల‌తోనే కుర్ర హీరోలు రియ‌ల్ రొమాన్స్ న‌డిపిస్తున్నారు. మ‌లైకా అరోరా...అర్జున్ క‌పూర్ లా. కాబ‌ట్టి తెర‌పై ఈ వ్య‌త్యాసాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. పైగా బాలీవుడ్ లో కుర్ర హీరోలు...సీనియ‌ర్ హీరోయిన్ల‌తో తెర‌పైని రియ‌ల్ రొమాన్స్ ని పండించిన వారెంతో మంది.