Begin typing your search above and press return to search.

ఇంతకి హీరో ఎవరు?

టాలీవుడ్ లో మాస్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి బోయపాటి శ్రీను.

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:33 AM GMT
ఇంతకి హీరో ఎవరు?
X

టాలీవుడ్ లో మాస్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి బోయపాటి శ్రీను. బోయపాటి సినిమా అంటే అందులో బీభత్సమైన యాక్షన్ సీక్వెన్స్ చూడొచ్చని చాలా మంది ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన కథలు బీ,సి సెంటర్స్ ఆడియన్స్ కి చేరువ అయ్యే విధంగా ఉంటాయి. సింహా సినిమాతో బాలయ్య బాబు ఇమేజ్ ని బోయపాటి అమాంతం మార్చేశాడు,

ఆ తరువాత లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని బాలకృష్ణకి ఇచ్చాడు. అయితే బాలయ్య కాకుండా బోయపాటి కలకుండా ఇతర హీరోలతో సినిమాలు చేసినపుడు మాత్రం ఎక్కువగా ఫ్లాప్ లు ఆయన్ని వరించాయి. కెరియర్ ఆరంభంలో చేసిన భద్ర బ్లాక్ బస్టర్ హిట్ అయితే తులసి మూవీ ఏవరేజ్ అయ్యింది. అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు మూవీ కొంత మెప్పించింది.

రీసెంట్ గా వచ్చిన స్కంద చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయిన కానీ బోయపాటి స్పీడ్ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా గీతా ఆర్ట్స్ బోయపాటి దర్శకత్వంలో మూవీ చేయడానికి ఒప్పందం చేసుకుంది. అఖండ సీక్వెల్ గీతా ఆర్ట్స్ లో బోయపాటి చేస్తాడనే ప్రచారం నడిచింది. అలాంటిదేం లేదని అల్లు అర్జున్ హీరోగా ఈ మూవీ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే తమిళ్ హీరో సూర్యకి ఇప్పటికే ఒక కథ చెప్పి ఒప్పించాడంట.

ఇప్పుడు సడెన్ గా ఫ్రేమ్ లోకి విజయ్ దేవరకొండ వచ్చాడు. త్వరలో అతనికి కథ చెప్పడానికి బోయపాటి సిద్ధ అవుతున్నాడంట. గీతా ఆర్ట్స్ విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయడానికి అడ్వాన్స్ లు కూడా ఇచ్చింది. గతంలో వచ్చిన గీతాగోవిందం మూవీ గీతా ఆర్ట్స్ 2కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.

అందుకే మరోసారి విజయ్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు పరశురామ్ దర్శకత్వంలోనే విజయ్ మూవీ చేద్దామని అనుకున్న అతను దిల్ రాజుకి మొగ్గు చూపించడంతో ఇప్పుడు ఇంకో దర్శకుడి కోసం చూస్తున్నారు. ఆ స్థానంలోకి బోయపాటి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకే డైరెక్టర్ ఇప్పటి వరకు నలుగురు హీరోలకి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కథలు చెప్పడం విశేషం కాగా వాటిలో ఏది ముందుగా స్టార్ట్ అవుతుందనేది వేచి చూడాలి.