Begin typing your search above and press return to search.

బోయపాటి.. ఇప్పుడు దారెటు?

అయితే బాలయ్యతో చేసినపుడు ఒప్పుకునే ఆడియన్స్ బయటి హీరోలతో మాత్రం అవే ఎలివేషన్ సీన్స్ ని ట్రోల్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   25 Dec 2023 4:18 AM GMT
బోయపాటి.. ఇప్పుడు దారెటు?
X

బోయపాటి అంటే బాలయ్యతో చేసిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాలతో బ్లాక్బస్టర్ హిట్స్ ని బోయపాటి శ్రీను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే బాలయ్యకి సక్సెస్ ఇచ్చినట్లు బోయపాటి ఇతర హీరోలకి ఇవ్వలేకపోతున్నాడు. బోయపాటి స్టైల్ మేకింగ్, టేకింగ్, స్టొరీ పరంగా బాలయ్యతో ఏదైతే చేస్తున్నాడో అదే ఫార్మాట్ లో ఇతర హీరోలతో కూడా చేస్తున్నారు.

అయితే బాలయ్యతో చేసినపుడు ఒప్పుకునే ఆడియన్స్ బయటి హీరోలతో మాత్రం అవే ఎలివేషన్ సీన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. మరీ టూమచ్ గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్ పరంగా కూడా బాలయ్య సినిమాలకి ఇచ్చినట్లే ఇచ్చినా కూడా ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు. అస్సలు లాజిక్ లు లేకుండా నడిచే కథ, కథనాలపై పూర్తిగా పెదవి విరుస్తున్నారు.

రీసెంట్ గా రామ్ తో స్కంద సినిమా చేసిన బోయపాటి అతని కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఇచ్చారు. ఈ సినిమాలో చాలా సన్నివేశాలని ఆడియన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. కొత్తగా ట్రై చేయాలనే ప్రయత్నంలో కథని కన్ఫ్యూజ్ చేసేశారని విమర్శలు వచ్చాయి. డ్యూయల్ రోల్ లో రామ్ ని తీసుకొచ్చి పెట్టారు. అయితే ఆ సెకండ్ పాత్రని ప్రొపర్ గా వాడలేదు.

ఇక రామ్ చరణ్ తో వినయవిదేయ రామ, ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలు కూడా ఎక్స్ట్రీ,మ్ యాక్షన్ సీక్వెన్స్ తోనే తన స్టైల్ లో చేసిన డిజాస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బోయపాటి నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య బోయపాటితో అఖండ 2 చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పట్లో బాలకృష్ణ డేట్స్ ఖాళీగా లేవు.

నెక్స్ట్ ఛాయిస్ అల్లు అర్జున్ ఉన్నారు. బాలయ్య తర్వాత బోయపాటి హిట్ ఇచ్చింది సరైనోడు సినిమాతో అల్లు అర్జున్ కి మాత్రమే. బన్నీ కూడా బోయపాటితో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నారు. అల్లు అరవింద్ కూడా బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. అయితే పుష్ప తర్వాత అతని ఛాయస్ పాన్ ఇండియా కథల పైనే ఉంది. అందుకే నెక్స్ట్ త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నారు. మరి ఈ లోపు బోయపాటితో ఏమైనా మాస్ సినిమా ట్రై చేస్తారా అనేది చూడాలి.