Begin typing your search above and press return to search.

మాస్ డైరెక్ట‌ర్ కంబ్యాక్ సాధ్య‌మేనా?

అన్నిసార్లు ఒకే త‌ర‌హా మాస్ మ‌సాలా ఫార్ములా వ‌ర్క‌వుట‌వ్వ‌ద‌ని 'స్కంధ' నిరూపించింది. ఈ సినిమా ప‌రాజ‌యం బోయ‌పాటి కీర్తి మ‌స‌క‌బారేలా చేసింది

By:  Tupaki Desk   |   17 Oct 2023 4:04 AM GMT
మాస్ డైరెక్ట‌ర్ కంబ్యాక్ సాధ్య‌మేనా?
X

అన్నిసార్లు ఒకే త‌ర‌హా మాస్ మ‌సాలా ఫార్ములా వ‌ర్క‌వుట‌వ్వ‌ద‌ని 'స్కంధ' నిరూపించింది. ఈ సినిమా ప‌రాజ‌యం బోయ‌పాటి కీర్తి మ‌స‌క‌బారేలా చేసింది. రొటీన్ కంటెంట్ తో ఫ్లాప్ త‌ప్ప‌ద‌ని మ‌రోసారి ప్రూవైంది. ప్ర‌చార కంటెంట్ తో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా అనూహ్యంగా బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ పడిపోవ‌డం నిరాశ‌ప‌రిచింది. దీంతో పంపిణీదారులు భారీ నష్టాలను చవిచూస్తున్నార‌ని ట్రేడ్ చెబుతోంది. ఈ ఫ‌లితం బోయ‌పాటి త‌దుప‌రి ప్రాజెక్టుపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది.


ప్ర‌స్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలంతా భారీ లైన‌ప్‌తో పూర్తి బిజీగా ఉన్నారు. స‌రైనోడు లాంటి హిట్ సినిమాకి ప‌ని చేసిన‌ అల్లు అర్జున్ ని ఒక ఆప్ష‌న్ గా బోయ‌పాటి భావిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఐకాన్ స్టార్ పుష్ప 2 త‌ర్వాత కూడా వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ స‌హా ప‌లువురు టాప్ డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేయ‌నున్నాడు. అందువ‌ల్ల వెంట‌నే అల్లూతో బోయ‌పాటి సినిమా వీలుప‌డద‌ని ఒక అంచ‌నా.

ఇత‌ర అగ్ర హీరోలు కూడా భారీ పాన్ ఇండియా సినిమాలు మాత్ర‌మే చేయాల‌నుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో రెగ్యుల‌ర్ మాస్ యాక్ష‌న్ ఫార్ములాటిక్ సినిమాలు చేసేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేర‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ఈ స‌న్నివేశంలో బోయపాటి శ్రీను అయోమయంలో ఉన్నార‌ని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలోను బోయ‌పాటికి ఒక ఆప్ష‌న్ ఉంది. త‌మిళ స్టార్ హీరో సూర్య‌తో సినిమా చేయాల‌ని బోయ‌పాటి చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే సూర్య స్క్రిప్టు విని ఓకే చెప్పారా లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. అటు కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అందుకోవాల‌ని క‌ల‌లుగంటున్న స్టార్ల‌లో సూర్య కూడా ఉన్నారు. కేజీఎఫ్ - పుష్ప- పొన్నియ‌న్ సెల్వ‌న్ లాంటి చిత్రాలు పాన్ ఇండియా విజ‌యాలు అందుకున్న త‌ర్వాత సూర్య కూడా కంగువ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నాడు. వారియ‌ర్ క‌థాంశంతో ఈ చిత్రం అత్యంత భారీగా తెర‌కెక్కుతోంది. ఒక‌వేళ ఈ సినిమా విజ‌యం సాధిస్తే అత‌డి ప్ర‌ణాళిక‌లు ఎలా మార‌తాయో కూడా ఊహించ‌గ‌లం. బోయ‌పాటితో సూర్య సినిమా చేస్తారా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. చివ‌రిగా సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ఖుషీగా ఉన్న బాల‌కృష్ణ అయినా చివ‌రి ఆప్ష‌న్ గా బోయ‌పాటికి మ‌రో అవ‌కాశం ఇస్తారా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. దీనికి ర‌క‌ర‌కాల కార‌ణాలు. బాల‌య్య బాబు కూడా ప‌లువురు ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయాల్సి ఉంది.