Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌పై బోయ‌పాటి వ్యాఖ్య‌ల వెన‌క‌..

ఇంత‌కీ ప‌వ‌న్ పై బోయ‌పాటి ఏమ‌ని కామెంట్ చేసారు? ఈ వ్యాఖ్య‌ల మీనింగ్ ఏమిటీ? అంటూ అభిమానుల్లో ఆరాలు మొద‌ల‌య్యాయి.

By:  Tupaki Desk   |   21 Oct 2023 4:13 AM GMT
ప‌వ‌న్‌పై బోయ‌పాటి వ్యాఖ్య‌ల వెన‌క‌..
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో న‌టిస్తూనే, మ‌రోవైపు రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణాన్ని ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో బ్యాలెన్స్ చేస్తున్నారు. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ గెలుపే ప‌ర‌మావ‌ధిగా ఆయన హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు.

ఇప్పుడు జ‌న‌సేనానిపై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కామెంట్ ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ప‌వ‌న్ పై బోయ‌పాటి ఏమ‌ని కామెంట్ చేసారు? ఈ వ్యాఖ్య‌ల మీనింగ్ ఏమిటీ? అంటూ అభిమానుల్లో ఆరాలు మొద‌ల‌య్యాయి. ఇంత‌కీ బోయ‌పాటి ఏమ‌న్నారు? అంటే.. ''పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్టర్ లేని వాడు.. ఎది అనుకుంటే అది చేస్తాడు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ నిలబడతాడు. ఎక్కడ నిజాయితీ ఉంటే అక్కడ ఉంటాడు. న్యాయం ఉన్న చోట అడ్డ సుడిగా నిలబడతాడు'' అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఒక ర‌కంగా ప‌వ‌నిజం ఫాలోవ‌ర్స్ లో ఉత్సాహం నింపే వ్యాఖ్య‌లివి. ప‌వ‌న్ వ్య‌క్తిత్వాన్ని బోయ‌పాటి త‌న‌దైన శైలిలో పొగిడేశారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌ల వెన‌క లాజిక్ ఏమిటి? అంటూ ఫ్యాన్స్ జ‌వాబు కోసం వెతుకుతున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. బోయ‌పాటి తెర‌కెక్కించిన 'స్కంధ' ఫ్లాప్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి సూర్య క‌థానాయ‌కుడిగా అత‌డు ఓ సినిమాని తెర‌కెక్కించాల్సి ఉంది. దీనిపై త‌దుప‌రి అప్ డేట్ రావాల్సి ఉంటుంది.

మ‌రోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి లాంటి భారీ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నిక‌ల కోసం ప‌వ‌న్ బిగ్ బ్రేక్ తీసుకుంటార‌న్న చ‌ర్చా ఉంది. ప్ర‌స్తుతానికి ప‌వ‌న్ సినిమాల రిలీజ్ తేదీల‌పై క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది.

లిస్ట్ పెద్ద‌దే ఉంది కానీ..!

బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ చిత్రాల కారణంగా టాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో భాగమైన అత‌డు ఫక్తు కమర్షియల్ యాక్షన్ సినిమాలతో రాణించాడు.

అయితే రామ్ పోతినేనితో స్కంధ‌ చిత్రం అవాస్తవంగా ఉందని విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా స్కంద రెండో భాగం కూడా ఉంటుందని ప్ర‌చార‌మైంది. అయితే దీనిని బోయ‌పాటి ధృవీక‌రించ‌లేదు.

ఇంత‌లోనే సూర్య క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స‌రైనోడు లాంటి హిట్ సినిమాని ఇచ్చాడు గ‌నుక‌ అల్లు అర్జున్‌తో ఓ చిత్రం చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టించిన‌ తన సినిమా అఖండ సీక్వెల్ తెర‌కెక్కించేందుకు ఛాయిస్ ఉంద‌ని ఇంత‌కుముందు బోయపాటి శ్రీను తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టులేవీ అధికారికంగా క‌న్ఫామ్ కాలేదు ఇంకా.