Begin typing your search above and press return to search.

బోయపాటి.. ఇది బ్రేక్ చేయలయ్యా?

వరుస పెట్టి విలన్స్ ని నరుక్కుంటూ వెళ్ళిపోయినా క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే అలాంటి కథలు ఇతర హీరోలతో చేస్తే మాత్రం ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం లేదు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 12:30 AM GMT
బోయపాటి.. ఇది బ్రేక్ చేయలయ్యా?
X

టాలీవుడ్ లో బోయపాటి శ్రీను అంటే వెంటనే మాస్ చిత్రాలు గుర్తుకొస్తాయి. రొటీన్ కథ, కథనాలతో సాగిన నాలుగు, ఐదు పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టి ప్రేక్షకులని కన్విన్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని అతని సినిమాలు నచ్చుతాయి. అయితే కొత్తదనం కోరుకునేవారికి మాత్రం బోయపాటి సినిమాలు అస్సలు నచ్చవు. కాని అతను మాత్రం ప్రయోగాల జోలికి పోకుండా ఒకే ఫార్ములాతో మూవీస్ చేస్తూ వస్తున్నాయి.

అయితే బోయపాటి కథలు, హీరోయిజం బాలయ్యబాబుకి భాగా వర్క్ అవుట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. బోయపాటి సినిమాలో బాలయ్య ఏం చేసిన ప్రేక్షకులకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. వరుస పెట్టి విలన్స్ ని నరుక్కుంటూ వెళ్ళిపోయినా క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే అలాంటి కథలు ఇతర హీరోలతో చేస్తే మాత్రం ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం లేదు.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమా చేశారు. ఆ మూవీ తారక్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు హిట్ అయిన కూడా మరీ బ్లాక్ బస్టర్ అయితే కాదు. అల్లు అర్జున్ ఆ మూవీలో కొత్తగా కనిపించడంతో ఆడియన్స్ కొంతవరకు రిసీవ్ చేసుకున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన జయ జానకి నాయక కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.

రామ్ చరణ్ తో చేసిన వినయ విదేయ రామా చిత్రం అయితే అతి పెద్ద డిజాస్టర్ గా మారింది. ఈ సినిమాపై అప్పట్లో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇప్పటికి వినయ విదేయ రామా సినిమాని మీమ్స్ కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. మరోసారి స్కంద సినిమాని రామ్ పోతినేనితో బోయపాటి చేశారు. ట్రైలర్ చూస్తుంటే తన స్టైల్ లో విలన్ ఊచకోత కనిపిస్తోంది.

అలాగే రొటీన్ గా సాగే పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీ వర్క్ అయితే నాన్ బాలయ్య సినిమాల విషయంలో బోయపాటి మీద ఉన్న నెగిటివ్ టాక్ పోయే అవకాశం ఉంది. లేదంటే బోయపాటి కేవలం బాలయ్య సినిమాలకి మాత్రమే వర్క్ అవుట్ అవుతాడని డిసైడ్ అయిపోతారు. రామ్ పోతినేనికి కూడా ఈ మూవీతో కచ్చితంగా హిట్ పడాలి. మరి వీరిద్దరి కెరియర్ ని స్కంద ఎలా డిసైడ్ చేస్తుందో చూడాలి.