Begin typing your search above and press return to search.

బాలయ్య బోయపాటి మరింత లేట్..!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో అంటే నందమూరి ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క

By:  Tupaki Desk   |   16 Aug 2023 2:30 PM GMT
బాలయ్య  బోయపాటి మరింత లేట్..!
X

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో అంటే నందమూరి ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క. ఈ సింహా, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ హిట్లతో ఈ కాంబో స్టామినా ఏంటన్నది చూపించారు. అఖండ అయితే బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. అఖండ నుంచి బాలయ్య మాస్ స్టామినా కొనసాగిస్తున్నారు. ఈ ఇయర్ ఆల్రెడీ వీర సింహా రెడ్డితో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనీల్ రావిపుడితో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా విషయంలో కూడా నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. భగవంత్ కేసరి టీజర్ కూడా సినిమాపై భారీ హైప్ ఏర్పడేలా చేసింది. భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ మరోసారి బోయపాటి శ్రీను తో సినిమా చేస్తాడని టాక్ వచ్చింది. అఖండ 2 ని చేయాలని బోయపాటి బాలయ్య అనుకుంటున్నారు. కానీ స్కంద తర్వాత బోయపాటి మరో హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య వేరే డైరెక్టర్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.

బాలకృష్ణ, బోయపాటి చెరో సినిమా చేశాక మళ్లీ ఇద్దరు కలిసి అఖండ 2 సినిమా చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ సినిమాకు 5 నెలలు టైం పెట్టుకున్నారట బాలకృష్ణ. ఈలోగా బోయపాటి మరో హీరోతో సినిమా మొదలు పెట్టి పూర్తి చేయాల్సి ఉంది. 2024 సెకండ్ హాఫ్ లో బాలకృష్ణ బోయపాటి సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న బాలకృష్ణ రాబోతున్న భగవంత్ కేసరి సినిమాతో కూడా కొనసాగించాలని చూస్తున్నాడు. బాబీ తో చేస్తున్న సినిమా కూడా వెరైటీగా ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు వీర సింహా రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో కూడా బాలకృష్ణ మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట. సో చూస్తుంటే బాలకృష్ణ 108 నుంచి 110 వరకు లిస్ట్ రెడీ అయిపోయిందని చెప్పొచ్చు.

సినిమాలన్నీ కూడా భారీ కాంబినేషన్స్ తో వస్తున్నవే కాబట్టి నందమూరి ఫ్యాన్స్ కి బాలకృష్ణ వరుస సినిమాలు మాస్ ఫీస్ట్ అందించడం పక్కా అని చెప్పొచ్చు. దసరాకి భగవంత్ కేసరి వస్తుండగా 2024 మార్చి లో బాబీ బాలకృష్ణ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆరు నెలల్లోనే బాలయ్య రెండు సినిమాలు ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ అందించనున్నాయని చెప్పొచ్చు.