Begin typing your search above and press return to search.

బోయపాటి బీభత్సానికి బాలయ్య మాత్రమే యాప్ట్

మాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న బోయపాటి శ్రీను తాజాగా స్కంద చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 11:30 PM GMT
బోయపాటి బీభత్సానికి బాలయ్య మాత్రమే యాప్ట్
X

మాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న బోయపాటి శ్రీను తాజాగా స్కంద చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. మరీ శృతి మించిపోయిన వైలెన్స్, ఓవర్ గా అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ తో క్యారెక్టర్ వెయిట్ ని రామ్ పోతినేని మోయలేకపోయాడనే మాట వినిపిస్తుంది.

బోయపాటి అంటే లాజిక్ కి దూరంగా హీరో చేసే విన్యాసాలు ఉంటాయి. వందల మందిని కూడా ఈజీగా చంపేస్తాడు. పోలీస్ క్యారెక్టర్స్ కేవలం ప్రేక్షకపాత్రకి పరిమితం అవుతాయి. ఎంత పెద్ద రౌడీలు అయిన హీరో చేతిలో దారుణంగా దెబ్బలు తింటాడు. స్కంద సినిమా ఈ హద్దులు అన్ని దాటిపోయింది. రొటీన్ గా సాగే డైలాగ్స్, బీభత్సమైన ఎలివేషన్స్ తో మూవీ నడుస్తూ ఉంటుంది.

ఈ పాత్రలో రామ్ ని అసలు ప్రేక్షకులు డైజిస్ట్ చేసుకోలేకపోయారు. ఈ కారణంగా మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇప్పటి వరకు బ్రేక్ ఎవెన్ కలెక్షన్స్ లో 50 శాతం మాత్రమే రికవరీ వచ్చింది. స్కంద ఫ్లాప్ తో బోయపాటి బీభత్సానికి కేవలం బాలయ్య మాత్రమే సెట్ అవుతాడని నిర్ధారణ అయిపొయింది. సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో బాలయ్యతో బోయపాటి హ్యాట్రిక్ కొట్టాడు.

బాలయ్య కాకుండా బోయపాటి చేసిన సినిమాలలో దమ్ము, జయ జానకి నాయకా, వినయ విదేయ రామా, స్కంద సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. బాలయ్య తర్వాత కేవలం అల్లు అర్జున్ మాత్రమే సరైనోడు సినిమాలో బోయపాటి పాత్రని మోయగలిగాడు. బయట హీరోలతో మూవీస్ చేసిన కూడా ఇకపై ఇదే రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.

బోయపాటి మాత్రం సూర్యతో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే బాలయ్యతో అఖండ సీక్వెల్ కి రంగం సిద్ధం చేస్తున్నాడు. మరి వీటిలో ఏది ముంది సెట్స్ పైకి వెళ్తుందనేది క్లారిటీ లేదు. యంగ్ హీరోలు మాత్రం బోయపాటితో సినిమాలు చేసే విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది.