Begin typing your search above and press return to search.

బోయపాటి పవర్ఫుల్ లైన్ అప్.. హీరోలు ఎవరంటే..

మాస్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న బోయపాటి శ్రీను గత ఏడాది స్కంద మూవీతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు

By:  Tupaki Desk   |   26 Jan 2024 7:30 AM GMT
బోయపాటి పవర్ఫుల్ లైన్ అప్.. హీరోలు ఎవరంటే..
X

మాస్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న బోయపాటి శ్రీను గత ఏడాది స్కంద మూవీతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అఖండతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ పోతినేనికి మాత్రం స్కందతో ఫ్లాప్ ఇచ్చారు. ఒక ఫ్లాప్ పడినంత మాత్రాన బోయపాటి ఇమేజ్ కి ఎలాంటి డోకా లేదని చెప్పొచ్చు. అందుకే స్టార్ హీరోలు సైతం బోయపాటితో మూవీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో మూవీ చేయడానికి ఇప్పటికే కమిట్ అయ్యారు. ఈ సినిమాని అల్లు అర్జున్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. పుష్ప ది రూల్ తర్వాత అల్లు అర్జున్ బోయపాటి దర్శకత్వంలో మూవీ చేసే అవకాశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని తర్వాత బాలయ్యతో అఖండ సీక్వెల్ ఉంటుంది. ఈ సినిమాపై నందమూరి అభిమానులు చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు.

తమిళ్ స్టార్ హీరో సూర్యకి బోయపాటి శ్రీను ఇప్పటికే ఒక మాస్ కమర్షియల్ కథని నేరేట్ చేసి ఒకే చేయించుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య వరుసగా మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. వీటి తర్వాతబోయపాటికి కాల్ షీట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దానికి కనీసం రెండేళ్లు పట్టొచ్చు. ఈ లోపు అయితే అల్లు అర్జున్ తో లేదంటే బాలయ్యతో బోయపాటి మూవీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

నెక్స్ట్ బోయపాటి చేయబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కనున్నాయి. బాలయ్యతో చేయబోయే అఖండ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ బోయపాటి స్టైల్ హై వోల్టేజ్ అండ్ మాస్ యాక్షన్ కథలతోనే తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలని బోయపాటి కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం టాలీవుడ్ నుంచి నెక్స్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ ని అందుకుంటాడు.

ఇప్పటికే రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా డైరెక్టర్స్ గా వారి బ్రాండ్ క్రియేట్ చేశారు. ఇక చందూ మొండేటి, ప్రశాంత్ వర్మ, కూడా అదే దిశలో సక్సెస్ లు అందుకొని ముందుకి వెళ్తున్నారు. బోయపాటి సినిమాలలో ఉండే హై వోల్టేజ్ కరెక్ట్ గా ఆడియన్స్ కి రీచ్ అయితే మాత్రం అతని రేంజ్ మారిపోతుంది.