బోయపాటి నెక్స్ట్ హీరో అతడేనా?
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2025 2:30 AMనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసుకుని భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ లో బిజీ అవుతాడు. మరి బోయపాటి ఏ హీరోతో పని చేస్తా డు? అంటే ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడం మాత్రం లాంఛనమే.
బోయపాటితో సినిమా చేస్తానని చిరంజీవి పబ్లిక్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కుదిరితే బాలయ్య కాంబినేషన్ లోనే ఆ సినిమా ఉండాలని కోరారు. ప్రస్తుతానికి అది జరగకపోయినా? చిరంజీవి టార్గెట్ గానే బోయపాటి కథ సిద్దం చేయడం మాత్రం ఖాయమే. చిరంజీవి నటిస్తోన్న 157వ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. `అఖండ 2` రిలీజ్ అనంతరం బోయపాటి చిరు స్క్రిప్ట్ పై పోకస్ పెడతారు.
పూర్తి కావడానికి ఎలా లేదన్నా మూడు నాలుగు నెలలు సమయం పడుతుంది. ఈలోపు 157 రిలీజ్ అవు తుంది. కాబట్టి చిరు-బోయపాటిలకు ఎలాంటి క్లాష్ ఉండదు. ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా వెసులు బాటు ఉంటుంది. కాకపోతే చిరంజీవిని బోయపాటి ఎలా హైలైల్ చేస్తాడు? అన్నదే ఆసక్తికర అంశం. బాలయ్య-చిరంజీవి ఫాలోయింగ్ మధ్య చిన్న వ్యత్యాసం ఉంది. బాలయ్య లా చిరంజీవి చూపిస్తామంటే అభిమానులు ఒప్పుకోరు.
బాలయ్య చిటికేస్తే కుర్చీ వస్తుంది. ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారు. బాలయ్య ఇమేజ్ కోణంలో వర్కౌట్ అతుతుంది. అదే స్టైల్ మళ్లీ రజనీకాంత్ కి వర్కౌట్ అవుతుంది. చిరంజీవితో అలాంటి ఫీట్లు చేయిస్తే మాత్రం రిస్క్ అవుతుంది. చిరంజీవితో బోయపాటి ఎలాంటి సినిమా తీసినా? మెగా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. అభిమానులు ఆ తరహా కంటెంట్ ని మాత్రమే స్వాగతిస్తారు.