Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ కాచుకో.. సెప్టెంబర్ వచ్చేస్తోంది..!

ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెలలో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా చాలానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 Aug 2023 9:42 AM GMT
బాక్సాఫీస్ కాచుకో.. సెప్టెంబర్ వచ్చేస్తోంది..!
X

టాలీవుడ్ మంచి జోరుమీద ఉంది. బాక్సాఫీసు కాసుల వర్షంతో కళకళలాడుతోంది. ఇప్పటికే ఆగస్టు నెలలో మంచి శుభారంభం అందుకుంది. రిమేక్ మూవీ అయినా రజినీకాంత్ జైలర్ తెలుగులోనూ మంచి హిట్ అందుకుంది. కార్తీకేయ బెదురులంక పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక, మరో చిన్న సినిమా బాయ్స్ హాస్టల్ కూడా ఇక్కడ అదరగొడుతోంది. ఒక్క పెద్ద సినిమా వస్తేనే ఆగస్టు నెలంతా ఇంత కళకళలాడింది అంటే, ఇక వచ్చేది సెప్టెంబర్ నెల ఇంకెంత హడలు పుట్టిస్తుందో చూడాలి.

ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెలలో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా చాలానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చూసే ప్రేక్షకుడుకి ఊపు ఉండాలే కానీ, ఈ నెలంతా సినిమాలే. దాదాపు అన్నింటికీ మంచి బజ్ కూడా ఉంది.

కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు, సినిమాలన్నీ కాసుల వర్షం కురిపించడానికి రెడీగా ఉన్నాయి. ముందుగా విజయ్ దేవరకొండ, సమంత ల ఖుషీతో ఈ సెప్టెంబర్ మాసం ప్రారంభం కానుంది. ఈ పాన్ ఇండియాకి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీని తెరపై చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అనుష్క మూవీ మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి కూడా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్నోసార్లు వాయిదా పడినా, చివరకు థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. అదే రోజున షారూఖ్ జవాన్ కూడా విడుదలౌతోంది. ఈ రెండు సినిమాలకు కూడా బజ్ గట్టిగానే ఉంది. కానీ, విడుదలైతే తప్ప, ఏది క్లిక్ అవుతుందో చెప్పలేం.

ఈ సినిమాలు కాస్త గ్యాప్ ఇవ్వగానే,వినాయక చవితి కి మరో మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. రామ్ పోతినేని స్కంద మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి డైరెక్షన్, శ్రీలీల హీరోయిన్ కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇదే తేదీన తమిళ హీరో విశాల్ మార్క్ ఆంథోని అనే భిన్నమైన కథతో వస్తున్నారు. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ లారెన్స్ నటిస్తున్న చంద్రముఖి 2 కూడా ఇదే రోజున విడుదలౌతోంది. కంగనా ఇందులో చంద్రముఖి పాత్రలో నటించనున్నారు. ఈ త్రిక్కోన పోటీలో వినాయకుడి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సెప్టెంబర్ నెలాఖరుకు వస్తున్న సలార్ మరొక ఎత్తు. వరస ఫెయ్యిల్యూర్లతో సతమతమౌతున్న ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సలార్ మూవీపైనే ఫ్యాన్స్ ఆశలుపెట్టుకున్నారు. ఈ నెల 28న విడుదలౌతోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, ఈ మూవీతో బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ది వ్యాక్సిన్ వార్ అనే సినిమాని విడుదల చేస్తున్నారు. మరి ఈ సెప్టెంబర్ మాసం బాక్సాఫీసు వార్ లో ఏ సినిమాసులు ఎంత సత్తా చాటుతాయో చూడాలి.