Begin typing your search above and press return to search.

2024 బాక్సాఫీస్.. మొదటి 'ఫైటర్' రెడీ!

మొత్తానికి షారుఖాన్ అయితే మళ్లీ ఫామ్ లోకి రావడమే కాకుండా చాలా డల్ గా ఉన్న బాలీవుడ్ మార్కెట్ ని లైన్ లోకి తీసుకువచ్చాడు.

By:  Tupaki Desk   |   4 Dec 2023 10:04 PM GMT
2024 బాక్సాఫీస్.. మొదటి ఫైటర్ రెడీ!
X

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి 2023 బాగానే కలిసి వచ్చింది. ముఖ్యంగా షారుక్ ఖాన్ రెండు సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. పఠాన్ సినిమా ఏకంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే టాప్ లిస్టులో చేరిపోయింది. ఇక ఆ తర్వాత జవాన్ సినిమా కూడా అదే రేంజ్ లో సక్సెస్ కా నిలిచింది. మొత్తానికి షారుఖాన్ అయితే మళ్లీ ఫామ్ లోకి రావడమే కాకుండా చాలా డల్ గా ఉన్న బాలీవుడ్ మార్కెట్ ని లైన్ లోకి తీసుకువచ్చాడు. రణబీర్ యానిమాల్ తో మరింత వైబ్ క్రియేట్ చేశాడు.


ఇక సల్మాన్ ఖాన్ మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కొట్టలేకపోయాడు. టైగర్ 3 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. చాలావరకు డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా నష్టాలను కలిగించింది. ఇక నెక్స్ట్ అయితే డిసెంబర్ కు మరోసారి షారుక్ ఖాన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో చేస్తున్న డంకీ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్గా విడుదల కాబోతోంది.

ఇక ఈ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ కారణంగా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 1000 నుంచి 1500 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అయితే వస్తాయి. ఇక దీని తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 2024లో మొదటగా హడావిడి చేసే హీరో హృతిక్ రోషన్. అతని నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా ఫైటర్ విడుదల డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్ సినిమాను జనవరి 24వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతోంది. వందేమాతరం అనే బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా ఆ పోస్టర్ను హైలైట్ చేయడంతో సినిమాలో దేశభక్తి పాయింట్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాటీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా అందులో మెన్షన్ చేశారు. ఇక వార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న హృతిక్ రోషన్ ఫైటర్ తో కూడా మంచి అంతకుమించి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. 2024 బాలీవుడ్ ఫస్ట్ బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీ ఇదే కావడంతో ఎలాంటి ఆరంభాన్ని ఇస్తుందో అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఫైటర్ అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.