Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్.. బాక్సాఫీస్ కు బాగా కలిసొచ్చిందే

కొత్త సంవత్సరం ఆరంభం అంటే మెజారిటీగా ప్రజలు పార్టీలలో మునిగితేలుతూ ఉంటారు

By:  Tupaki Desk   |   2 Jan 2024 4:13 AM GMT
న్యూ ఇయర్.. బాక్సాఫీస్ కు బాగా కలిసొచ్చిందే
X

కొత్త సంవత్సరం ఆరంభం అంటే మెజారిటీగా ప్రజలు పార్టీలలో మునిగితేలుతూ ఉంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండటం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆరంభం మాత్రం ఈ సెలబ్రేషన్స్ తో పాటుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లలో సినిమాలు కూడా చేరాయి. డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో చాలా వరకు థియేటర్స్ కి మంచి ఆక్యుపెన్సీ లభించడం బట్టి ప్రేక్షకుల ఇంట్రెస్ట్ తెలుస్తోంది.

సలార్ మూవీ వీక్ డేస్ లో కొంత కలెక్షన్స్ తగ్గాయి. అయితే వీకెండ్ అయిన శని, ఆదివారాలు మరల మంచి వసూళ్లు రావడం విశేషం. ఈ కలెక్షన్స్ తో సలార్ ఓవరాల్ కలెక్షన్స్ 700 కోట్లకి రీచ్ అయ్యింది. దీనిని బట్టి డిసెంబర్ 31తో పాటు జనవరి 1 కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. కేవలం సలార్ మాత్రమే కాకుండా కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా మొదటి రోజు కంటే మంచి వసూళ్ళని శని, ఆదివారాలు కలెక్ట్ చేశాయి.

అలాగే జనవరి 1 అయిన సోమవారం కూడా సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా వచ్చిన బబుల్ గమ్ కి ఎవరేజ్ టాక్ వచ్చింది. అయితే రోషన్ పెర్ఫార్మెన్స్ కి, అందులో ఉండే కంటెంట్ కి యూత్ భాగా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మూవీ కూడా డీసెంట్ వసూళ్లు సొంతం చేసుకుంది. యానిమల్, హాయ్ నాన్న సినిమాలు ఆడుగుతున్న థియేటర్స్ కూడా ఫుల్ అయ్యాయంటే ఎంతగా ప్రేక్షకాదరణ అందుకున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

వీకెండ్ రెండు రోజులతో పాటుగా జనవరి 1న సోమవారం తో కలుపుకొని 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలాగే డెవిల్ కూడా మూడు రోజుల్లో కలిపి 12.42 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఈ కలెక్షన్స్ నిలకడగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఏడాది కొత్త సంవత్సరం సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ప్రేక్షకులు మంచి శుభారంభం ఇచ్చారు.

2024 ఏడాదిలో టాలీవుడ్ నుంచి మొదటి సినిమాగా సింగర్ సునీత తనయుడు నటించిన సర్కారు నౌకరి మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ఎవరేజ్ టాక్ పడింది. కాన్సెప్ట్ బాగుందనే అభిప్రాయం క్రిటిక్స్ నుంచి వచ్చింది. మరి ప్రేక్షకులు మూవీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది వేచి చూడాలి.