Begin typing your search above and press return to search.

రూ.10 కోట్లతో హక్కులు.. సాంగ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో!

ఇండియన్ మూవీస్ లోని దేశభక్తి గేయాల్లో ఇప్పటికే కొన్ని ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 May 2025 1:04 PM IST
Sonu Nigam & Arijit Join Forces for Border 2
X

ఇండియన్ మూవీస్ లోని దేశభక్తి గేయాల్లో ఇప్పటికే కొన్ని ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అలాంటి వాటిలో 'సందేశే ఆతే హై' సాంగ్ ఒకటి. 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోర్డర్ మూవీలోని ఆ పాట ఐకానిక్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ సాంగ్ తో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయనున్నారు బోర్డర్-2 సినిమా మేకర్స్.

బోర్డర్ మూవీకి సీక్వెల్ గా రానున్న బోర్డర్-2ను గత ఏడాది మేకర్స్ ప్రకటించారు.

ఇప్పుడు ఆ సినిమా కోసం 'సందేశే ఆతే హై' సాంగ్ ను ప్రముఖ సింగర్స్ సోను నిగమ్, అరిజిత్ సింగ్ రీ క్రియేట్ చేయనున్నారు. కొత్త వెర్షన్ తో సందడి చేయనున్నారు. ఒరిజినల్ ట్రాక్ ను అప్పుడు సోను నిగమ్, రూప్ కుమార్ రాథోడ్ ఆలపించారు.

యుద్ధ సమయంలో సైనికుల భావోద్వేగాలతో కూడిన ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాట హక్కులు రూ.10 కోట్లకు బోర్డర్ 2 మేకర్స్ పొందినట్లు తెలుస్తోంది. టీ-సిరీస్ అధినేత, ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ చేసుకున్న ఆ డీల్.. సాంగ్ రీమిక్స్ క్యాటగిరీలో కొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే సందేశే ఆతే హై 2.0 మరోసారి ఒరిజినల్ ట్రాక్ లాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనే నమ్మకంతో నిర్మాత భూషణ్ కుమార్ రూ.10 కోట్లు వెచ్చించినట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒక గీతాన్ని తిరిగి సృష్టించడానికి ఒక నిర్మాత ఖర్చు చేసిన అత్యధిక ధరల్లో ఇది ఒకటిగా అంతా చెబుతున్నారు.

అదే సమయంలో త్వరలో సందేశే ఆతే హై 2.0 రికార్డింగ్ జరగనుందని సమాచారం. ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోశాంజ్ తదితరులపై చిత్రీకరించనున్నారని వినికిడి. బోర్డర్ 2 చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 2025 నాటికి పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్ తో ఉన్నారు.

జేపీ దత్తా, భూషణ్ కుమార్, నిధి దత్తా నిర్మిస్తున్న బోర్డర్ 2 దేశభక్తి నేపథ్యంతో ఉండనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినీ ప్రియులు అలాంటి చిత్రాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో రూ.1000 కోట్లు పక్కా అని, గదర్ 2 రికార్డులు అధిగమిస్తుందని చాలా మంది ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బోర్డర్ 2 ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.