Begin typing your search above and press return to search.

క‌రోనాలో బీమా లేక ఆగిపోయిన భారీ సినిమా

క‌రోనా క్రైసిస్ సినీరంగాన్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో భారీ చిత్రాల నిర్మాణం చేప‌ట్టిన చాలా మంది నిర్మాత‌ల ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రం.

By:  Tupaki Desk   |   5 Oct 2023 1:30 AM GMT
క‌రోనాలో బీమా లేక ఆగిపోయిన భారీ సినిమా
X

క‌రోనా క్రైసిస్ సినీరంగాన్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో భారీ చిత్రాల నిర్మాణం చేప‌ట్టిన చాలా మంది నిర్మాత‌ల ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రం. అప్ప‌ట్లోనే మైదాన్ లాంటి భారీ చిత్రాన్ని ప్రారంభించిన నిర్మాత బోనీక‌పూర్ అనూహ్యంగా పెరిగిన ఖ‌ర్చులకు బెంబేలెత్తిపోయార‌ట‌. కంటికి కునుకుప‌ట్ట‌లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ డ్రామా `మైదాన్` గజిబిజి నిర్మాణం గురించి బోనీ ఓపెన‌య్యాడు. మూడు సంవత్సరాల క్రితం మైదాన్ చిత్రీకరణ ప్రారంభించాం. 2019 చివరి నాటికి చాలా వరకు పూర్తయింది. కానీ అనుకోని పరిస్థితులు ఆలస్యానికి దారితీశాయి అని బోనీ చెప్పాడు. క్రైసిస్ లో ఆర్థిక విపత్తులను తగ్గించడానికి ప్ర‌య‌త్నించామ‌ని కూడా బోనీ తెలిపారు.

ప్ర‌ముఖ జాతీయ మీడియాకి ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో నిర్మాత బోనీక‌పూర్ మాట్లాడుతూ.. అనూహ్య‌ మహమ్మారి వాతావరణం కారణంగా మైదాన్ చిత్రీక‌ర‌ణ చాలా ఆలస్యం అయ్యిందని, మొదట ఆరు నెలలకు మాత్రమే లీజుకు తీసుకున్న భూమికి అంత‌కంటే ఎక్కువ నెలలు అద్దె చెల్లించాల్సి వచ్చినందున ఖర్చులు అమాంతం పెరిగాయని చెప్పారు. దానికి తోడు వందలాది మంది సమూహాలతో కూడా ప‌ని చేయాల్సి వచ్చింది. ఇలా ఆలస్యం అయినందున సంతృప్తికరమైన మొత్తాన్ని బీమాగా పొందలేదని కూడా బోనీ వెల్లడించాడు.

అమిత్ రవీందర్ నాథ్ శర్మ దర్శకత్వంలో `మైదాన్` భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగం నాటి కథతో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం వాస్తవానికి గత సంవత్సరం RRR తో పాటు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంకా సరైన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయ‌లేదు. మైదాన్ క్రైసిస్ గురించి బోనీ మాట్లాడుతూ నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాన‌ని అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ-``నేను ఎప్పుడూ నిరుత్సాహపడను. నేను ఎద్దును కూడా కొమ్ములతో పట్టుకుంటాను. నేను ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రపోతాను. కానీ ఇటీవల మైదాన్‌ కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. కానీ నా జీవితంలో మొదటిసారిగా, పరిస్థితి నా నియంత్రణలో లేదని నేను భావించాను``అని అన్నారు. దీని గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేనని చెప్పాడు. కానీ బోనీకి ఇంకా ఆశ ఉంది. ``ఇది జాయింట్ వెంచర్ల యుగం.. నాకు భాగస్వాములు ఉన్నారు.. నాకు కొంత ఆదాయంలో వాటా ఉన్న నటులు ఉన్నారు.. మునుపటిలాగా ప్ర‌తిదీ అంత సులభం కాదు… టీమ్ అంతా నాపై ఆధారపడి ఉన్నందున నేను ధైర్యంగా అడుగులు వేయలేను`` అని కూడా అన్నారు.

ఫుట్‌బాల్ పిచ్ కోసం లీజుకు తీసుకున్న 16 ఎకరాల భూమి గురించి అడిగినప్పుడు నిర్మాత‌ బోనీ ఇలా అన్నాడు, ``మేము చాలా కష్టపడ్డాము. సహజమైన టర్ఫ్‌తో పూర్తి ఫుట్‌బాల్ మైదానాన్ని తయారు చేసాము. కృత్రిమ పచ్చిక కాదు.. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే 50 లు 60 లలో కృత్రిమ టర్ఫ్ లేదు. మేము రెండు స్టాండ్‌లను నిర్మించాము. గ్రీన్ స్క్రీన్‌లను ఉపయోగించాము… ఆ సెట్ మూడు సంవత్సరాలకు పైగా ఉంది. అదే సినిమా బడ్జెట్‌ను కూడా పెంచింది. మేము ఓవర్‌షాట్ చేయలేదు. కానీ మేము మైదానానికి అద్దె చెల్లించాల్సి వచ్చింది. మేము క్యూరేటర్‌లకు పారితోషికం ఇవ్వాల్సి వచ్చింది. మేము గ్రౌండ్‌ను నిర్వహించాల్సి వచ్చింది. ప్రతిరోజూ దాదాపు 500-600 మంది సిబ్బందితో ప‌ని చేసాము. తాజ్ నుంచి ఆహారం అందించాము. మాకు సెట్‌లో రెండు లేదా మూడు అంబులెన్స్‌లు ఉండేవి`` అని చిత్రీక‌ర‌ణ క‌ష్టాల గురించి బోనీ తెలిపారు.

అంతేకాదు.. తుపాను వెల‌సిన‌ తర్వాత సెట్‌ను పునర్నిర్మించాల్సి వచ్చిందన్నారు. ఈ అన్ని విపత్తులు వేరు. ఇది వేరు. మహమ్మారి పెద్ద సమస్యను సృష్టించింది. దురదృష్టవశాత్తు మా సినిమాకి భీమా లేదు... అప్ప‌టికి, మాకు ఏమీ లేదు. స‌హ‌నిర్మాత‌లు అందించినది నేను ఖర్చు చేసిన దానిలో చాలా తక్కువ మొత్తం... అని బోనీ క‌పూర్ తెలిపారు. ప్రియమణి - గజరాజ్ రావు త‌దిత‌రులు నటించిన మైదాన్ జూన్ 2023 విడుదలకు రీషెడ్యూల్ అయింది. కానీ మరోసారి ఆలస్యం అయింది. ఆరు నెలల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పెండింగ్ 20శాతాన్ని పూర్తి చేసి నిర్మాణానంత‌ర ప‌నుల్ని ముగిస్తే రిలీజ్ కి తెచ్చేందుకు ఆస్కారం ఉంది. దీనికి స్టార్ల నుంచి స‌రైన మ‌ద్ధ‌తు ల‌భించాల్సి ఉంది.