పండ్ల రసాలతో 25 కేజీలు తగ్గిన సినీ నిర్మాత
ఇప్పుడు బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీకపూర్ ఏకంగా 25 కేజీల బరువు తగ్గారు. దీనికోసం ఆయన స్ట్రిక్టుగా ఆహార నియమాలను పాటించారు.
By: Tupaki Desk | 23 July 2025 9:55 AM ISTసరైన ఆహార నియమాలు పాటిస్తే, జిమ్ కి వెళ్లాల్సిన పని లేకుండానే బరువు తగ్గొచ్చని కొందరు నిరూపిస్తున్నారు. ఇంతకుముందు తాను స్ట్రిక్ట్ గా ఆహార నియమాలు పాటించడం ద్వారా చాలా బరువు తగ్గానని మ్యాడీ అలియాస్ ఆర్.మాధవన్ అన్నారు. తన డైట్ ప్లాన్ ని కూడా ఈ సీనియర్ నటుడు రివీల్ చేసాడు.
ఇప్పుడు బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీకపూర్ ఏకంగా 25 కేజీల బరువు తగ్గారు. దీనికోసం ఆయన స్ట్రిక్టుగా ఆహార నియమాలను పాటించారు. సలాడ్ లు, సూప్ లు, పండ్లు, పండ్ల రసాలు, జవర్ రోటీ వంటి సింపుల్ డైట్ తో అతడు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని తెలిపారు. కార్బో హైడ్రేట్లు ఉన్న డైట్ తక్కువగా తిన్నారు బోనీ.
ఇటీవల బోనీకపూర్ మారిన రూపానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారగా దీనిపై పెద్ద డిబేట్ మొదలైంది. నిజానికి అతడి కొత్త రూపం బిగ్ సర్ ప్రైజింగ్. బోనీ చాలా స్లిమ్ గా మారి కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నారు.
బోనీ క్యాజువల్, సెమీ ఫార్మల్స్‌లో చాలా స్లిమ్ గా, అందంగా కనిపిస్తున్నాడు. అయితే బరువు తగ్గడం వెనక సీక్రెట్ ని అతడు రివీల్ చేసాడు. అనవసరమైన విందు వినోదాలను వదిలేసి, కేవలం సూప్‌లు, పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటున్నానని బోనీ చెప్పారు. అంతే కాదు అల్పాహారంలో పండ్లు, రసం - జవర్ రోటీ మాత్రమే తీసుకున్నట్టు తెలిపారు. అనుభవజ్ఞుడైన బోనీ కపూర్ ఈ ఆకృతిని పొందడానికి జిమ్‌కు వెళ్లలేదని కూడా గ్రహించాలి. స్వచ్ఛమైన నిజాయతీతో కూడుకున్న అంకితభావం, కృషితో మాత్రమే ఇది సాధ్యమైందని బోనీ చెప్పారు.
