Begin typing your search above and press return to search.

'బొమ్మరిల్లు' భాస్కర్.. మరీ ఈ రేంజ్ ట్విస్టా?

దర్శకుడు భాస్కర్ మొదటి సినిమా బొమ్మరిల్లు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని పేరులోనే అది కూడా కలిసిపోయింది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 10:15 AM GMT
బొమ్మరిల్లు భాస్కర్.. మరీ ఈ రేంజ్ ట్విస్టా?
X

దర్శకుడు భాస్కర్ మొదటి సినిమా బొమ్మరిల్లు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని పేరులోనే అది కూడా కలిసిపోయింది. అలా మంచి గుర్తింపును అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత పరుగు సినిమాతో కూడా తన రేంజ్ ను పెంచుకున్నాడు. అయితే మూడవ సినిమా ఆరెంజ్ మాత్రం అతనికి కోలుకోలేని దెబ్బ కొట్టింది. అప్పట్లో ఆ సినిమా ఆదుకున్న ఫలితం వలన నాగబాబులు చాలా ఆర్థిక నష్టాలకు గురయ్యారు.

ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే ఆరెంజ్ మళ్లీ రీరిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సందడి క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పబవసరం లేదు. బొమ్మరిల్లు భాస్కర్ తలుచుకుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మరిన్ని వస్తాయి అని కూడా చాలామంది అతనికి సలహాలు ఇచ్చారు ఇక ఆదర్శకుడు అదే కాన్ఫిడెన్స్ తో డిఫరెంట్ కదలను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.

ఆమధ్య అఖిల్ అక్కినేనితో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు అతను స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డతో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈసారి కూడా మరో ప్రేమ కథతో లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈ దర్శకుడు ఊహించిన విధంగా తన స్టైల్ కు భిన్నంగా విన్నమైన కథతో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పటికే ఈ సినిమాకు జాక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇది అతని స్టైల్ కు భిన్నంగా స్పై కామెడీ తరహాలో ఉండబోతుందట. అంతేకాకుండా సినిమాలో యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది హాలీవుడ్లో ఇప్పటికే ఈ జానర్ చాలా రకాల సినిమాలు వచ్చాయి. ఇక తెలుగువారికి కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు భాస్కర్ తనలోని అసలైన స్టైలిష్ యాక్షన్ ను చూపిస్తూనే మరొకవైపు పై కామెడీ ని కూడా హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఒక విధంగా అతని నుంచి ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. కథను ఎంచుకోవడంలోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్న భాస్కర్ ఇదే కాన్ఫిడెన్స్ తో సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే విధంగా ప్రమోషన్ చేస్తే మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.