జవాన్ బాటలో బాలీవుడ్ స్టార్స్..!
By: Tupaki Desk | 5 Aug 2023 6:00 AM ISTబాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తుంటే పఠాన్ తో ఆ హిట్ దక్కింది. పఠాన్ తర్వాత జవాన్ గా ఈ ఇయర్ మరోసారి తన సినిమాతో రాబోతున్నాడు షారుఖ్ సౌత్ స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న అట్లీ షారుఖ్ కి ఇమేజ్ కి తగిన కథతో జవాన్ తెరకెక్కించాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాపై ట్రైలర్ తో అంచనాలు పెంచారు. జవాన్ సినిమాతో మరో సౌత్ డైరెక్టర్ బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నాడు.
షారుఖ్ బాటలోనే మిగతా బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ డైరెక్టర్స్ పై దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఈమధ్య సౌత్ స్టార్ డైరెక్టర్స్ క్రేజ్ ఏంటన్నది వారు తీసిన సినిమాలు పాన్ ఇండియా వైడ్ లో సత్తా చాటుతున్నాయి. షారుఖ్ ఖాన్ అట్లీని సెట్ చేసుకున్నట్టుగా బాలీవుడ్ హీరోలు రణ్ బీర్, రన్ వీర్ సింగ్, షాహిద్ ఇలా అందరు సౌత్ డైరెక్టర్స్ తో పనిచేయాలని చూస్తున్నారు.
పుష్పతో సుకుమార్, కార్తికేయ 2 తో చందు మొండేటి ఇలా మన తెలుగు డైరెక్టర్స్ అంతా కూడా మన హీరోలతోనే పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్స్ మాత్రం తెలుగు, తమిళ హీరోలతో పని చేయాలని అనుకుంటున్నారు. జవాన్ హిట్ పడితే మాత్రం సౌత్ డైరెక్టర్స్ కి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సందీప్ వంగా, గౌతం తిన్ననూరి ఆల్రెడీ బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేశారు.
సందీప్ వంగ రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సందీప్ టాలెంట్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసుకోనున్నాడు. అట్లీ జవాన్ తో యానిమల్ తో సందీప్ హిట్ పడితే మాత్రం మళ్లీ సౌత్ డైరెక్టర్స్ సత్తా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారుతుంది. షారుఖ్ జవాన్ లో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై బీ టౌన్ లోనే కాదు సౌత్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పఠాన్ తో హిట్ ట్రాక్ ఎక్కిన షారుఖ్ జవాన్ తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. షారుఖ్ జవాన్ నిజంగానే సౌత్ లో సత్తా చాటుతుందా లేదా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది.
