Begin typing your search above and press return to search.

సౌత్‌ రీమేక్ లో బాలీవుడ్ స్టార్‌ కిడ్స్‌...!

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ లో వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 March 2024 5:27 AM GMT
సౌత్‌ రీమేక్ లో బాలీవుడ్ స్టార్‌ కిడ్స్‌...!
X

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ తనయుడు జునైద్ ఖాన్‌ హీరోగా అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ జంటగా ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ లో వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ స్టార్ కిడ్స్‌ మూవీ గురించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ప్రకారం తమిళంలో సూపర్ హిట్‌ అయిన లవ్ టుడే కి రీమేక్‌ గా ఈ హిందీ సినిమా రూపొందబోతుంది. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ గా సాగే లవ్‌ టుడే సినిమాలో ప్రదీప్ రంగనాథన్‌ మరియు ఇవానా జంటగా నటించిన విషయం తెల్సిందే.

ఇప్పటికే నటిగా ఎంట్రీ ఇచ్చిన ఖుషీ కపూర్‌ కి కమర్షియల్‌ బ్రేక్ దక్కలేదు. ఈ లవ్‌ స్టోరీ తో హిట్‌ దక్కే అవకాశాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు నమ్మకంగా ఉన్నారు. బాలీవుడ్‌ లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఖుషీ కపూర్‌ అక్క జాన్వీ కపూర్‌ మాదిరిగా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

లవ్‌ టుడే ను హిందీ లో రీమేక్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చివరకు జునైద్‌ ఖాన్‌, ఖుషీ కపూర్‌ లు జోడీగా సినిమా రూపొందబోతుంది. హిందీ నేటివిటీకి తగ్గట్టు కథ మరియు కథనం మార్చి సినిమాను రూపొందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన అన్ని విషయాలతో వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.