Begin typing your search above and press return to search.

మళ్లీ తెరపైకి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ సారి ఎవరితో అంటే

సినీ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులకి సాధారణంగా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 4:06 PM GMT
మళ్లీ తెరపైకి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ సారి ఎవరితో అంటే
X

సినీ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులకి సాధారణంగా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎప్పటికైనా ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని, తెరపై దాన్ని ఆడియెన్స్ కు చూపించాలని బలంగా కోరుకుంటుంటారు. కానీ అది అందరికీ కార్యరూపం దాల్చదు. ఒకవేళ కార్యరూపం దాల్చినా సక్సెస్ అవుతుందన్నా గ్యారెంటీ లేదు. కొన్ని సందర్భాల్లో సెట్స్ పైకి వెళ్లి కూడా ఆగిపోతుంటాయి. ఎన్నో అడ్డంకులు కూడా ఎదురౌతుంటాయి.

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు అంతే. ఆయన కలల ప్రాజెక్ట్ 'జనగనమణ' ఎన్నో సార్లు చెప్పారు. ఆ కథను ఎట్టి పరిస్థితుల్లో తెరకెక్కిస్తానని స్ఫష్టం కూడా చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేక ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఆగిపోతూనే వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాను చేయాలని పూరి మళ్లీ సిద్ధమవుతున్నారని తెలిసింది.

అసలీ 'జనగనమణ' ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఈ సినిమా చేయడానికి పూరి జగన్నాధ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. పోకిరి, బిజినెస్ మెన్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ చిత్రం చేయాలని ఆశించారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వర్కౌట్ అవ్వలేదన్న మాటలు వినిపిస్తుంటాయి. దీంతో 'జనగనమణ'ను పూరి పక్కన పెట్టేశారని అని అన్నారు.

కానీ పూరి వదల్లేదు. లైగర్ చేస్తున్న సయంలోనే విజయ్ దేవరకొండతోనే ఆ సినిమాను అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ అచ్చారు. పూజా హెగ్డేను హీరోయిన్ గా కూడా తీసుకున్నారు. సినిమాను ప్రారంభించి కాస్త హడావుడి కూడా చేశారు. ఫొటోషూట్స్ చేసి.. కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

కానీ ఆ తర్వాత లైగర్ ఫ్లాప్ దెబ్బకు దాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విజయ్.. తన కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టి ముందుకెళ్లిపోయారు. పూరి కూడా కాస్త గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ 'జనగనమణ'ను పేరు తెరపైకి వచ్చింది. పూరి మళ్లీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. డబుల్ ఇస్మార్ట్ చేస్తూనే 'జనగనమణ'కు సంబంధించిన పనులు కూడా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నారని సమాచారం అందింది.

ఎవరైనా బాలీవుడ్ కు చెందిన స్టార్స్ తో ఈ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగైనా ఒకరిని ఒప్పించి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్నారట. చూడాలి మరి పూరి.. తన కథతో ఏ హీరోను ఇంప్రెస్ చేస్తారో సెట్స్ పైకి సినిమాను ఎప్పుడు తీసుకెళ్తారో.. అసలు తన కలల ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారో లేదో..