Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కూడా ఒక స్కాం అనేసాడు

అంటే తాజాగా వివేక్ అగ్నిహోత్రి చేసిన కామెంట్ల‌ను బ‌ట్టి అదంతా ఉత్తుత్తేన‌ని అనుకోవాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   2 Oct 2023 8:30 AM GMT
బాలీవుడ్ కూడా ఒక స్కాం అనేసాడు
X

500 కోట్లు.. 1000 కోట్లు అంటూ వ‌సూళ్ల లెక్క‌లు చెబుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన అగ్ర‌హీరో న‌టించిన రెండు సినిమాలు 1000 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టాయ‌ని ప్ర‌క‌టించారు. అంత‌కుముందు కొన్ని సినిమాల‌కు ఇదే త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. అయితే ఈ ప్ర‌చారాన్ని న‌మ్మేదెలా? ఇందులో నిజం ఎంత‌? ఆయా సినిమాల‌ వ‌సూళ్లు నిజంగానే ఆ స్థాయిని చేరుకున్నాయా? అంటే ఇప్పుడు సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

బ‌డ్జెట్లు.. బాక్సాఫీస్ ఓపెనింగులు.. తొలి వీకెండ్.. తొలి వారం వ‌సూళ్లు అంటూ నానా హంగామా క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇవ‌న్నీ నిజాలేనా? అంటే తాజాగా వివేక్ అగ్నిహోత్రి చేసిన కామెంట్ల‌ను బ‌ట్టి అదంతా ఉత్తుత్తేన‌ని అనుకోవాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ త‌ప్పుడు ప్రచారమేనంటూ.. మ‌రోసారి అత‌డు డిబేట్ కి తెర లేపాడు. కాశ్మీర్ ఫైల్స్ - వ్యాక్సిన్ వార్ లాంటి రియ‌లిస్టిక్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు అత‌డు. ఇప్పుడు వ్యాక్సిన్ వార్ ప్ర‌మోష‌న్స్ లో అగ్నిహోత్రి కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రఖ్యాత ద‌ర్శ‌క‌నిర్మాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తాజా వీడియోతో హిందీ చిత్ర పరిశ్రమలో ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌కు తెర తీసారు. ఈ వీడియోలో అతడు బాలీవుడ్ స్కామ్ అని సంబోధించాడు. ఈ చర్చలో ఇటీవల విడుదలైన ది వ్యాక్సిన్ వార్ వ‌సూళ్ల‌ను స్కామ్ ఎలా ప్రభావితం చేసిందనే దానిపై ధైర్యంగా మాట్లాడాడు. చాలా సినిమాల‌కు హైప్ క్రియేట్ చేసి ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల ఇత‌ర సినిమాలు స‌రిగా ఆడ‌లేదనే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంటుంద‌ని కూడా అగ్నిహోత్రి ఆవేద‌న చెందాడు. నిజ‌మే.. మా సినిమా 500 కోట్లు.. 1000 కోట్లు అని లెక్క చెబుతుంటే .. సాధార‌ణంగా ఆడే సినిమాల విష‌యంలో ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటారో ఊహించ‌గ‌లం. ఇక అగ్నిహోత్రి వ్యాఖ్య‌ల‌పై ప్ర‌భాస్ అభిమానులు త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నారు.

ది వ్యాక్సిన్ వార్ లో నానా పటేకర్, సప్తమి గౌడ, రైమా సేన్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం భారతదేశం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన క‌రోనా క్రైసిస్ సమయంలోని కథను ఆవిష్క‌రించింది. పల్లవి జోషి - ఐ యామ్ బుద్ధ నిర్మించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగులో 28 సెప్టెంబర్ 2023న విడుదలైంది.