Begin typing your search above and press return to search.

బాలీవుడ్ రామాయణ.. ఇదెక్కడి ట్విస్ట్?

భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాంనున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 1:30 PM GMT
బాలీవుడ్ రామాయణ.. ఇదెక్కడి ట్విస్ట్?
X

నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ లీడ్ రోల్ లో రామాయణం మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ కనిపించనున్నారు. రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటించనున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా అఫీషియల్ ఎనౌన్సమెంట్ కాలేదు. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాంనున్నారు.

అయితే ఈ మూవీ గురించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. సినిమాలో సీత పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేసారంట. ఆమె కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మూవీ ఆలస్యం అవుతూ ఉండటంతో సాయి పల్లవి ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు టాక్ బయటకొచ్చింది. అయితే అది ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు.

నిజానికి రామాయణం సినిమాలో సీత పాత్రని సాయి పల్లవి కూడా ఇష్టపడి ఒకే చేసిందంట. కానీ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ పార్క్, బ్రహ్మాస్త్ర సినిమాలు చేయాల్సి ఉంది. ఈ రెండు కంప్లీట్ అయ్యాక రామాయణం సినిమా స్టార్ట్ కావొచ్చు. అంటే కనీసం మూడేళ్లు అయిన పట్టే ఛాన్స్ ఉంది.

ఈ కారణంగానే సాయి పల్లవి సినిమా నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు బిటౌన్ టాక్. ఒక వేళ సాయి పల్లవి రామాయణం నుంచి తప్పుకుంటే సినిమాలో సీత పాత్ర కోసం అలియా భట్ ని తీసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యకి జోడీగా తండేల్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

సినిమాలో ఆమె శ్రీకాకుళంలో ఒక ఫిషర్ మెన్ కమ్యూనిటీ అమ్మాయిగా కనిపించనుంది. ఆమె పాత్ర కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్ లోనే మాట్లాడుతుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత రామాయణం సినిమాకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందేమో చూడాలి. సాయి పల్లవి రామాయణంలో సీత పాత్రలో నటిస్తే మాత్రం కచ్చితంగా ఆ క్యారెక్టర్ కి మంచి మైలేజ్ వస్తుంది.