Begin typing your search above and press return to search.

బాలీవుడ్ రామాయణ.. ఇక కన్ఫ్యూజన్ పోయేది ఆ రోజే..

ఇప్పటికే ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో వచ్చిన ఆదిపురుష్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

By:  Tupaki Desk   |   2 March 2024 5:45 AM GMT
బాలీవుడ్ రామాయణ.. ఇక కన్ఫ్యూజన్ పోయేది ఆ రోజే..
X

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజులుగా వైరల్ అవుతున్న ప్రాజెక్టులలో రామాయణం కూడా ఒకటి. ఈ కథను భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలి అనే చాలా మంది అగ్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో వచ్చిన ఆదిపురుష్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొందరు మరోసారి ప్రయోగంతో రిస్క్ చేయకూడదు అనే ఆలోచనకు కూడా వచ్చారు.

కానీ మరి కొందరు దర్శక నిర్మాతలు మాత్రం పర్ఫెక్ట్ గా జనాలకు నచ్చే విధంగా న్యాచురల్ గా తెరపైకి తీసుకువస్తే క్లిక్ అవుతుంది అనే ఆలోచిస్తున్నారు. ఆదిపురుష్ లో అసలైన రామాయణాన్ని చూపించకుండా ఎక్కువగా గ్రాఫిక్స్ హైలెట్ చేశారు. అవి కూడా పర్ఫెక్ట్ గా లేకపోవడంతోనే ఫ్లాప్ అయింది అని కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అయితే అలాంటి పొరపాటు జరగకుండా దాన్ని ఒక పాఠంగా తీసుకుని తదుపరి రామాయణం కథను తెరపైకి తీసుకురావాలి అనే ఆలోచిస్తున్నారు.

అలాంటి వారిలో దంగల్ దర్శకుడు నితీష్ తివారి కూడా ఉన్నారు. రణబీర్ కపూర్ ని శ్రీరాముడిగా మొదట్లోనే ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అయితే మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బలంగా ఉండాలి అనీ.. పర్ఫెక్ట్ క్యాస్ట్ సెట్ అయితేనే ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలి అని రణబీర్ కపూర్ దర్శకుడితో మాట్లాడాడు. ఇక సాయి పల్లవిని సీత పాత్ర కోసం సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ మధ్య ఒక టాక్ అయితే వినిపించింది.

ఇక రావణుడి పాత్రలో కన్నడ స్టార్ యష్ ఒప్పుకున్నాడు అన్నట్లుగా కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ అయితే సినిమాను సెక్స్ పైకి తీసుకురావాలి అని నిర్మాతలు అనుకున్నారు. దాదాపు ఈ విషయం లో ఒక క్లారిటీ రావడంతో వెంటనే అధికారికంగా అనౌన్స్ మెంట్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు. ఇక పర్ఫెక్ట్ డేట్ కోసం ఎదురు చూడగా ఇప్పుడు శ్రీరామ నవమి రాబోతోంది.

ఏప్రిల్ 17న ఈ బిగ్గెస్ట్ రామాయణ ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ సిద్ధమవుతున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఆ రోజు వరకు ఎదురు చూడాల్సిందే. ఇక లక్ష్మణుడు పాత్ర కోసం టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టిని కూడా సంప్రదించినట్లు కూడా గాసిప్స్ వచ్చాయి.