Begin typing your search above and press return to search.

చంపుతానంటూ 41సార్లు బెదిరించిన స్టార్ హీరో

అత‌డు ఆమెతో నిండా ప్రేమ‌లో ఉన్నాడు. కానీ ఇంత‌లోనే స‌ద‌రు హీరోయిన్ జీవితంలోకి వేరొక న‌టుడు ప్ర‌వేశించారు

By:  Tupaki Desk   |   6 Feb 2024 2:20 AM GMT
చంపుతానంటూ 41సార్లు బెదిరించిన స్టార్ హీరో
X

అత‌డు ఆమెతో నిండా ప్రేమ‌లో ఉన్నాడు. కానీ ఇంత‌లోనే స‌ద‌రు హీరోయిన్ జీవితంలోకి వేరొక న‌టుడు ప్ర‌వేశించారు. ఆ క‌డుపు మంట‌తో అత‌డిని చంపుతానంటూ 41 సార్లు ఫోన్ చేసి మ‌రీ బెదిరించాడు ఆమె ప్రేమికుడు. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో ప్రేమికుడు ఎవ‌రు? ఎవ‌రు ఎవ‌రిని చంపుతాన‌ని అన్నారు? ఎవ‌రా సుంద‌రి? అన్న‌ది తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

వివేక్ ఒబెరాయ్ - ఐశ్వర్యారాయ్ బచ్చన్ మ‌ధ్య అనుబంధం ఒకప్పుడు చర్చనీయాంశం. అయితే వారి సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ అంద‌మైన జంట‌ 2005 లో విడిపోయారు. ఇప్పుడు ఐశ్వర్య పాత వీడియో ఒక‌టి అంత‌ర్జాలంలో వైరల్ అవుతోంది. అందులో ఆమె తన మాజీ ప్రియుడు వివేక్ ఒబెరాయ్ గురించి మాట్లాడింది. పాత క్లిప్ 'కాఫీ విత్ కరణ్ 1' షో నుండి తిరిగి వెబ్ లోకి వచ్చింది. ఇందులో ఐశ్వర్య వివేక్‌ను అత్యంత ఆశాజనకమైన కొత్త వ్య‌క్తి అని తెలిపింది.

వివేక్ ఒబెరాయ్‌ని 'అద్భుతమైన స్నేహితుడు' అని ఐశ్వర్యారాయ్ ఆ చాటింగ్ సెష‌న్ లో పేర్కొంది. ఈ ఇంటర్వ్యూలో ర్యాపిడ్-ఫైర్ రౌండ్ సమయంలో హోస్ట్ కరణ్ మ‌ళ్లీ ప్ర‌శ్నించాడు. ఐశ్వర్యను క‌ర‌ణ్ ప్ర‌శ్నిస్తూ సల్మాన్ అని ఏదో అడ‌గ‌బోతే... 'నెక్ట్స్ ప్రశ్న' అంటూ ఐష్ క‌ట్ చేసింది. KJo వివేక్ పేరును ప్ర‌స్థావించ‌గానే..ఐశ్వర్యరాయ్ 'అతడు అద్భుతమైన స్నేహితుడ'ని, అతను ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటాడని చెప్పింది.

నిజానికి హమ్ దిల్ దే చుకే సనమ్ (1999) చిత్రంలో కలిసి పనిచేసిన తర్వాత ఐశ్వర్యరాయ్- సల్మాన్ ఖాన్ ఒకప్పుడు బలమైన సంబంధంలో ఉన్నారు. అయితే సల్మాన్ మోసం చేశాడని ఐశ్వ‌ర్యారాయ్ ఆరోపించడంతో వారి బంధం వీగిపోయింది. సల్మాన్‌తో విడిపోయిన తర్వాత ఐశ్వర్య తన కోస్టార్‌ల‌తో స్నేహానికి ప్ర‌య‌త్నించింది. 'హో గయా నా' సహ నటుడు వివేక్ ఒబెరాయ్ కి ఐశ్వ‌ర్యారాయ్ ద‌గ్గ‌రైంది.

అదే క్ర‌మంలో సల్మాన్ తాగి తనకు 41 సార్లు కాల్ చేసి చంపేస్తానని బెదిరించాడని వివేక్ ఒబేరాయ్ ఒకసారి ఆరోపించార‌ని ముంబై మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్‌లో వివేక్ ఒబెరాయ్ కెరీర్ నాశనం కావడానికి సల్మాన్ కారణమని పలువురు ఆరోపించారు. ఇప్ప‌టికీ స‌ల్మాన్ కి, ఒబేరాయ్ కి మ‌ధ్య మాట‌ల్లేవ‌ని కూడా చెబుతుంటారు. వివేక్ ఒబెరాయ్ సినీన‌ట‌డు కం నిర్మాత‌. ముంబైలో భారీ రియ‌ల్ వెంచ‌ర్ల‌తో వంద‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉన్న కంపెనీల‌కు అధినేత‌.