Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాల‌పై పంచ్ గట్టిగానే ప‌డిందే!

ఏప్రిల్ 10న 'మైదాన్'- ఆ మ‌రుస‌టి రోజున బ‌డేమియాన్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. మ‌రి ఈ సినిమాల బాక్సాఫీస్ ఫ‌లితం ఏంటి? అంటే అక్ష‌య్ కుమార్ కి మ‌రోసారి భారీ నిరాశే ఎదురైన‌ట్లు క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   16 April 2024 7:01 AM GMT
ఆ రెండు సినిమాల‌పై పంచ్ గట్టిగానే ప‌డిందే!
X

బాలీవుడ్ లో గ‌త వారం రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ కుమార్..టైగ‌ర్ ష్రాప్...పృధ్వీరాజ్ సుకుమారన్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'బ‌డేమియాన్ చోటే మియాన్'- స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన అజ‌య్ దేవ‌గ‌ణ్ మెయిన్ లీడ్ లో రూపొందిన 'మైదాన్' ఒక్క రోజుగ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 10న 'మైదాన్'- ఆ మ‌రుస‌టి రోజున బ‌డేమియాన్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. మ‌రి ఈ సినిమాల బాక్సాఫీస్ ఫ‌లితం ఏంటి? అంటే అక్ష‌య్ కుమార్ కి మ‌రోసారి భారీ నిరాశే ఎదురైన‌ట్లు క‌నిపిస్తుంది.

ఎలాగైనా ఈసినిమాతో హిట్ అందుకోవాల‌ని అక్ష‌య్ గ‌ట్టిగానే శ్ర‌మించాడు. తోడుగా టైగ‌ర్ ష్రాప్-పృథ్వీరాజ్ లాంటి వాళ్లు ఉన్నారు. దీంతో బడ్జెట్ ఏకంగా 300 కోట్లు అయింది. కానీ బాక్సాఫీస్ వ‌సూళ్లు చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. ఈ సినిమా కేవ‌లం ఇప్ప‌టివ‌ర‌కూ 50 కోట్లు వ‌సూళ్లు మాత్ర‌మే రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. మొద‌టి రోజే ఈ సినిమా వ‌సూళ్లు పేల‌వంగా క‌నిపించాయి. కేవ‌లం 15 కోట్లనే రాబ‌ట్టింది. ఈద్ హ‌లీడేని సినిమా ఎన్ క్యాష్ చేయ‌లేక‌పోయింది. థియేట‌ర్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. మ‌రో రెండు రోజులు ఆగితే ఆ సినిమాని థియేట‌ర్ల నుంచి తొల‌గిస్తారు.

ప్రస్తుతం ర‌న్నింగ్ లో సినిమాలు లేవు కాబ‌ట్టి ఆ మాత్ర‌మైనా తేగ‌లిగింద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ఇక మైదాన్ కి మంచి రివ్యూలు..పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఓపెనింగ్స్ లో ఎంతో వీక్ గానే ఉంది. అడ్వాన్స్ బుకింగ్ లు ఏమంత స్పీడ్ గా జ‌ర‌గ‌లేదు.

ప్రివ్యూల రూపంలోనే 2.60 కోట్లు సాధించింది. అటుపై మొదటి రోజు 4.65 కోట్ల నెట్‌ని ద‌క్కించుకోగల్గింది. వారాంతంలో కాస్త మెరుగుపడినప్పటికీ సినిమా మొత్తం 30 కోట్ల వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. అదీ కొన్ని దేశాలు రిబేట్లు ఇవ్వ‌డ‌తోనే ఆ ఫిగ‌ర్ క‌నిపిస్తుంది. ఈ సినిమా బ‌డ్జెట్ 100 కోట్లు. అంటే న‌ష్టాన్ని అంచ‌నా వేయోచ్చు.

సాధార‌ణంగా బ‌యోపిక్ అంటే బాలీవుడ్ జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తారు. సౌత్ ఆడియ‌న్స్ వాటికి బాగా క‌నెక్ట్ అవుతున్నారు. కానీ మైదాన్ విష‌యంలో ఆ స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సినిమా స్లోగా ఉంద‌నే విమ‌ర్శ కాస్త ప్రేక్ష‌కుల్ని ఆలోచ‌న‌లో ప‌డేసింది. ఇలా ఒకే వారంలో రెండు సినిమాలు భారీ న‌ష్టాలు చూసాయ‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. మ‌రి ఉన్న ఈ రెండు రోజుల వ్య‌వ‌ధిలోనైనా! ఎంత రాబ‌డ‌తాయో చూడాలి.