Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై కన్నేసిన బాలీవుడ్ స్టార్..!

అయితే హీరోయిన్స్ మాత్రమే కాదు అక్కడ హీరోలు కూడా తెలుగు ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 April 2024 1:30 AM GMT
టాలీవుడ్ పై కన్నేసిన బాలీవుడ్ స్టార్..!
X

పాన్ ఇండియా లెవెల్ లో సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు చేస్తున్న సందడి వల్ల అక్కడ స్టార్స్ కూడా తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఆఫర్ రాగానే మొహం చాటేసే హీరోయిన్స్ అంతా కూడా ఇక్కడ ఛాన్సుల కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఆల్రెడీ అలియా భట్, దీపికా పదుకొనె, జాన్వి కపూర్, కియరా అద్వాని లాంటి భామలంతా కూడా తెలుగు ఆఫర్లు అందుకున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రమే కాదు అక్కడ హీరోలు కూడా తెలుగు ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నారు.


బాలీవుడ్ హీరోయిన్స్ తో పాటుగా అక్కడ విలన్స్ ని వరుసగా తెలుగు సినిమాలకు తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు హీరోల వంతు వచ్చింది. బాలీవుడ్ లో కొన్నాళ్లుగా లక్ కలిసి రాని షాహిద్ కపూర్ సౌత్ సినిమాల రీమేక్ లతో మళ్లీ కెరీర్ గాడిన పడేలా చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ గా చేసిన కబీర్ సింగ్, జెర్సీ రీమేక్ గా చేసిన జెర్సీ సినిమాలతో షాహిద్ కపూర్ మంచి ఫలితాలను అందుకున్నాడు.

ప్రస్తుతం దేవ సినిమాలో నటిస్తున్న షాహిద్ కపూర్ ఛాన్స్ వస్తే తెలుగు సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాడట. తెలుగు రీమేక్ ల వల్ల తను మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన సందర్భంగా పాన్ ఇండియా లెవెల్ లో ఏదైనా కథ ఉంటే తాను తెలుగులో కూడా నటించేందుకు రెడీ అని హింట్ ఇస్తున్నాడట షాహిద్ కపూర్. సౌత్ సినిమాల్లో రియలిస్టిక్ ఎమోషన్స్ ఉంటున్నాయని అవి నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయని అప్పట్లో షాహిద్ కపూర్ అన్నాడు.

ఇప్పుడు సౌత్ సినిమాల్లో ఛాన్స్ వస్తే నటించేందుకు రెడీ అంటున్నాడు. మరి షాహిద్ ఆఫర్ ను ఏ తెలుగు దర్శకుడు క్యాచ్ చేస్తాడో చూడాలి. తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ టైం లో బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టారు. అందుకే సౌత్ సినిమాల మీద బాలీవుడ్ స్టార్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. షాహిద్ కపూర్ తో సోలో సినిమా కుదరకపోయినా మల్టీస్టారర్ ఛాన్స్ వచ్చినా సరే చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు స్టార్స్ హిందీ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అక్కడ స్టార్స్ కూడా తెలుగులో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు.