Begin typing your search above and press return to search.

మన హీరోయిన్స్‌ ఆ ప్రయత్నాలు ఆపడం లేదు..!

ప్రభాస్, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, చరణ్‌ వంటి ఇంకా కొంత మంది స్టార్స్ కి హిందీలో విపరీతమైన క్రేజ్ ఉంది

By:  Tupaki Desk   |   14 Dec 2023 1:30 PM GMT
మన హీరోయిన్స్‌ ఆ ప్రయత్నాలు ఆపడం లేదు..!
X

ఒకప్పుడు సౌత్‌ సినిమాలను హిందీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే వారే కాదు. అలాగే మన హీరోలు, హీరోయిన్స్‌ ని కూడా అక్కడి ప్రేక్షకులు మరియు ఫిల్మ్ మేకర్స్ లైట్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్‌ సినిమాల కోసం హిందీ ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అంతే కాకుండా నార్త్‌ లో మన హీరోలకి పెద్ద ఎత్తున అభిమాన సంఘాలే ఏర్పడ్డాయి.

ప్రభాస్, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, చరణ్‌ వంటి ఇంకా కొంత మంది స్టార్స్ కి హిందీలో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సౌత్‌ హీరోయిన్స్ విషయంలో మాత్రం పరిస్థితి మారడం లేదు. సౌత్‌ లో సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ ను బాలీవుడ్‌ మేకర్స్ లైట్‌ తీసుకుంటున్నారు. కొద్ది మంది మాత్రం ఇక్కడ చేసి అక్కడ కూడా ఆఫర్లు దక్కించుకుంటూ ఉన్నారు.

ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా అవి హిందీలో మన హీరోయిన్స్ కి పెద్ద సక్సెస్ గా మారడం లేదు. ఒక వేళ సక్సెస్ అయినా కూడా పాత్రలకు ప్రాముఖ్యత లేదు అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. చాలా కాలం నుంచి సౌత్ హీరోయిన్స్‌ బాలీవుడ్‌ లో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు... కానీ సక్సెస్‌ శాతం మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది.

ఈ ఏడాది జవాన్‌ సినిమా తో నయనతార బాలీవుడ్‌ లో హిట్ ని దక్కించుకుంది. అంతే కాకుండా యానిమల్‌ తో రష్మిక మందన్న కూడా హిందీలో మొదటి విజయాన్ని నమోదు చేసింది. దాంతో వీరిద్దరు ముందు ముందు మరిన్ని హిందీ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక వచ్చే ఏడాది సాయి పల్లవి, కీర్తి సురేష్‌, సమంత లు కూడా బాలీవుడ్‌ లో తమ అదృష్టంను పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీదేవి, టబు, తాప్సి ల స్థాయిలో సౌత్‌ హీరోయిన్స్ హిందీలో ఎప్పటికి హిట్స్ సాధించి, అక్కడ పట్టు సాధిస్తారో చూడాలి.