Begin typing your search above and press return to search.

RC 16: అనుకున్నట్లే బాలీవుడ్ బ్యూటీ వచ్చేసింది!

ఆలస్యం అయినా సరే రామ్ చరణ్ తోనే రెండవ సినిమా చేయాలని ఎదురుచూస్తున్న బుచ్చిబాబు మొత్తానికి ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకు వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   6 March 2024 4:59 AM GMT
RC 16: అనుకున్నట్లే బాలీవుడ్ బ్యూటీ వచ్చేసింది!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే వీలైనంత త్వరగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఆలస్యం అయినా సరే రామ్ చరణ్ తోనే రెండవ సినిమా చేయాలని ఎదురుచూస్తున్న బుచ్చిబాబు మొత్తానికి ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకు వస్తున్నాడు.


ఇక సినిమా అసలు హడావిడి మొదలైపోయింది. సినిమాలో నటినటుల విషయంలో అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే విధంగా మేకర్స్ అడుగులు వేస్తూ ఉన్నారు. హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే సందేహానికి ఫైనల్ గా చెక్ పడింది. హీరోయిన్ విషయంలో చాలా రకాల గాసిప్స్ వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఎన్ని రకాల వార్తలు వచ్చిన కూడా మొదట చిత్ర యూనిట్ సైలెంట్ గానే ఉంటూ వచ్చింది.

అయితే ఇప్పుడు అనుకున్నట్లే ఆ బ్యూటీని ఫైనల్ చేసేసారు. ఈరోజు జాన్వి కపూర్ పుట్టినరోజు కావడంతో ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసిన మేకర్స్ ఒక మంచి పోస్టర్ తో ఆమెకు వెల్కమ్ కూడా చెప్పారు. జాన్వీ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో అవకాశం అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక వెంటవెంటనే అమ్మడు RRR హీరోలతో ఛాన్సులు అందుకోవడం విశేషం. ఆమె కెరీర్ కు ఇది మంచి యూ టర్న్ పాయింట్. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్స్ గా క్రేజ్ అందుకుంటున్నారు. మరి ఈ సినిమాలు ఎలాంటి క్రేజ్ అందుకుంటాయో చూడాలి. ఇక RC16 సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వారికి ఇది మొదటి సినిమా.

ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఆస్కార్-విజేత స్వరకర్త AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇక చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.