Begin typing your search above and press return to search.

అల్లు అంటే హిందీ భామ‌లు ప‌డి చ‌స్తున్నారు!

అయితే ఈ విజ‌యం అనంత‌రం వెంట‌నే అల్లు అర్జున్ పొగ‌డ్త‌ల్లో ముంచేస్తూ ఆలియా- కృతి చేసిన ట్వీట్లు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   28 Aug 2023 11:30 PM GMT
అల్లు అంటే హిందీ భామ‌లు ప‌డి చ‌స్తున్నారు!
X

జాతీయ స్థాయిలో టాలీవుడ్ ఇమేజ్ ఏ స్థాయికి ఎదిగిందో చెప్పేందుకు ఇటీవ‌లి ప‌రిణామాల‌ను ప‌రిశీలించాలి. మ‌న సినిమాల‌ను రీమేక్ చేసేందుకు.. మ‌న స్టార్లు, ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు హిందీ ప‌రిశ్ర‌మ ఎంతో ఉవ్విళ్లూరుతోంది. కొన్నేళ్ల క్రితం ఓ బాలీవుడ్ హీరోయిన్ తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకరించడం తెలుగు ఇండస్ట్రీకి పెద్ద విషయంగా ఉండేది. మల్లీశ్వరిలో కత్రినా కైఫ్, మురారిలో సోనాలి బింద్రే, బద్రిలో అమీషా పటేల్, ప్రేమంటే ఇదేరాలో ప్రీతి జింతా పాత్రలు చేయడానికి అంగీకరించినప్పుడు వారంతా భారీ పారితోషికాలు డిమాండ్ చేసారు. పారితోషికంలో ఫేవ‌ర్ చేస్తేనే తెలుగులో న‌టించేందుకు అంగీక‌రించారు. కానీ ఇటీవ‌ల తెలుగు హీరోల రేంజ్ అమాంతం పెర‌గ‌డంతో సీన్ అంతా రివ‌ర్సులో ఉందిప్పుడు.

ఇటీవ‌ల‌ తెలుగు హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్ వ‌స్తే ఎగ‌రేసుకుపోయేందుకు బాలీవుడ్ క‌థానాయిక‌లు ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. దానికి కార‌ణం హిందీ హీరోల్ని త‌ల‌ద‌న్నేలా పాన్ ఇండియా మార్కెట్ల‌ను తెలుగు హీరోలు గుప్పిట‌ప‌ట్ట‌డ‌మేన‌న‌డంలో సందేహం లేదు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్ర‌క‌టించగా .. పుష్ప: ది రైజ్'లో తన అద్భుతమైన నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు. మరోవైపు 'గంగూబాయి కతియావాడి' పాత్రకు అలియా భట్ 'మిమి'లో పాత్రకు కృతి సనన్‌ సంయుక్తంగా ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.

అయితే ఈ విజ‌యం అనంత‌రం వెంట‌నే అల్లు అర్జున్ పొగ‌డ్త‌ల్లో ముంచేస్తూ ఆలియా- కృతి చేసిన ట్వీట్లు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ నుండి అభినందన సందేశాన్ని ఆలియా మళ్లీ రీపోస్ట్ చేస్తూ అత‌డి అసాధారణమైన నటనను మెచ్చుకుంది. నేను బ‌న్నీకి అతిపెద్ద అభిమానిని అని పేర్కొంటూ ప్రశంసలు కురిపించింది. అదేవిధంగా కృతి సనన్ అల్లు అర్జున్‌తో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేసింది. పుష్ప: ది రూల్ (పార్ట్ 2) చూడటం కోసం తన నిరీక్షణను తెలియజేసింది.

నిజానికి ఆర్.ఆర్.ఆర్ లో న‌టించేందుకు ఆలియా భారీ పారితోషికం డిమాండ్ చేసింద‌ని తాను కోరినంతా ఇవ్వ‌క‌పోతే న‌టించ‌లేన‌ని తెగేసి రాజ‌మౌళికి చెప్పింద‌ని ప్ర‌చార‌మైంది. కానీ చివ‌రికి ఆలియాను ఆఫ‌ర్ వ‌రించింది. ఇక కృతిస‌నోన్ తెలుగులో వ‌రుస చిత్రాల్లో న‌టించింది కాబ‌ట్టి త‌న గురించి అంత నెగెటివిటీ ఏదీ లేదు. మ‌హేష్‌- నాగ‌చైత‌న్య‌- ప్ర‌భాస్ లాంటి స్టార్ల స‌ర‌స‌న కృతి స‌నోన్ న‌టించింది. మునుముందు బ‌న్ని స‌ర‌స‌నా ఆఫ‌ర్ వ‌స్తే కాద‌న‌దు.

మ‌రోవైపు ఆర్.ఆర్.ఆర్ స్టార్ ఎన్టీఆర్ స‌ర‌స‌న ఆఫ‌ర్ రాగానే జాన్వీ క‌పూర్ ఎగిరి గంతేసింది. ఇప్పుడు తార‌క్ స‌ర‌స‌న కొర‌టాల సినిమాలో న‌టించేస్తోంది. చాలా మంది హీరోయిన్లు ఆర్.ఆర్.ఆర్ స్టార్లు ఎన్టీఆర్ -రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించాల‌ని కోరుకుంటున్నారు. ఇప్ప‌టికే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్ర‌భాస్ స‌ర‌స‌న అవ‌కాశం రావాలే కానీ వెంట‌నే లాక్ చేసేందుకు భామ‌లెవ‌రూ వెన‌కాడ‌డం లేదు. నాలుగైదేళ్ల కింద‌టితో పోలిస్తే ఈ మార్పు ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.