Begin typing your search above and press return to search.

నేనూ పిల్ల‌ల‌కు త‌ల్లి కాగ‌ల‌ను..మాజీపై న‌టి ర‌చ్చ‌

రాఖీ సావంత్.. ఆమె మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Oct 2023 2:30 AM GMT
నేనూ పిల్ల‌ల‌కు త‌ల్లి కాగ‌ల‌ను..మాజీపై న‌టి ర‌చ్చ‌
X

రాఖీ సావంత్.. ఆమె మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల గురించి తెలిసిందే. ఒక‌రితో ఒక‌రు బాహాబాహీకి దిగిన సంఘ‌ట‌న అంద‌రికీ షాకిచ్చింది. ఈ ఇద్ద‌రి మ‌ధ్యా సోష‌ల్ మీడియా వార్ గురించి తెలిసిన‌దే. తాజాగా ఆదిల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కలిసి ఉన్న సమయంలో తమ మధ్య జరిగిన పలు విషయాలను బ‌హిర్గ‌తం చేయ‌డ‌మే గాక‌ రాఖీ సావంత్‌పై మ‌రోసారి ఆదిల్ ఆరోపించారు.

ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిల్ ఇలా పేర్కొన్నాడు. ఆమె(రాఖీ) గర్భస్రావం జరిగిందని చెప్పడం ప్రారంభించిన 6-7 రోజులకు గొడ‌వ‌.. కానీ ఆమె గర్భవతి ఎలా అయింది? ఆమె ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయినప్పుడు వయసు సంబంధిత సమస్యల కారణంగా ఆమె గర్భాశయాన్ని తొలగించవలసి వచ్చినప్పుడు నేను ఆమెతో పాటు ఆసుపత్రిలో కూర్చున్నాను. ఆ క్షణంలో పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేశారు. రాత్రి ఈ ఘ‌ట‌న అనంత‌రం త‌న‌కు కాల్ చేసాను కాబట్టి.. నేను ఉదయం ఆమె ఉంటున్న చోటికి వెళ్లాను. ఆమె రాత్రికి రాత్రే నాపై FIR దాఖలు చేసింది.. అని తెలిపాడు.

అయితే రాఖీ సావంత్ అత‌డిపై ఎదురు దాడికి దిగింది. ``ఈరోజు నేను మా అమ్మ దగ్గరే ఉన్నాను. దేవుడు అన్ని చోట్ల‌కు చేరుకోలేడని, అందుకే మనం మంచిగా జీవించడానికి డాక్టర్లు ఉన్నారని అంటారు. నాకు ఎప్పుడో గర్భాశయం ఆపరేషన్ జరిగింది. అదిల్‌తో పెళ్లయ్యాక నేను ఒక కాన్పు చేయాలనుకున్నాను`` అని రాఖీ తాజా వీడియోలో పేర్కొంది. ``నా ఆరోగ్యం బాగానే ఉంది, నేను తల్లిని కాగలను`` అని రాఖీ ఈ వీడియోలో వ్యాఖ్యానించింది. ఆమె డాక్టర్ మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో డాక్ట‌ర్ మాట్లాడుతూ.. రాఖీ తల్లి కావచ్చు. ఆమె గర్భాశయం బాగానే ఉంది! అని చెప్పారు. మొత్తానికి రాఖీ వ‌ర్సెస్ ఆదిల్ న‌డుమ వార్ మ‌ళ్లీ మొద‌లైంది. దీంతో నెటిజ‌నులు మ‌రో కొత్త సీజ‌న్ స్టార్ట‌యిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ గొడ‌వ ఇంత‌టితో ఆగుతుందా?

రాఖీ సావంత్.. తాజాగా ఆదిల్ ఖాన్ దురానీకి చెందిన కొన్ని వీడియోలను సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేసింది. ``అతడు అడుక్కునేవాడు...`` అని వ్యాఖ్య‌ను జోడించింది. తనతో పెళ్లికి ఒప్పించాలని స్నేహితులను వేడుకున్నట్లు తెలిపింది. మాజీపై పగ తీర్చుకోవాలని రాఖీ ఇప్పుడు మ‌రోసారి నిర్ణయించుకుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. త‌న మాజీ భర్త కు చెందిన చాలా వీడియోలు ఫోటోలను రాఖీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ద్వారా అత‌డిపై మ‌ళ్లీ కాలు దువ్వుతోంది. ఈ వీడియోల సెట్‌లో ఆదిల్‌ని అతని స్నేహితుడు షెల్లీతో కలిసి పోస్ట్ చేసింది. క్యాప్షన్‌లో రాఖీ తనతో పెళ్లికి ఒప్పించమని ఆదిల్ తన స్నేహితుల ముందు వేడుకున్నట్లు వెల్లడించింది.

షెల్లీ, రాజారామ్‌ల ముందు ఆదిల్ అక్షరాలా అడుక్కున్నాడు. న‌న్ను పెళ్లి చేసుకోమని ఒప్పించాల్సిందిగా అడిగాడు. ప్రజలు ఇంత ద్వంద్వ ముఖంగా ఎలా ఉంటారు?? మనుషులు ఇంత ఫేక్ ఎలా అవుతారు? అతనికి కావలసింది నా డబ్బు మాత్రమే.. ఇప్పుడు అతడు చాలా దిగజారాడు. అతడు తన స్నేహితులను త‌ప్ప‌డు విధానంలో వినియోగిస్తున్నాడు. నేను సిగ్గు పడుతున్నాడు ఆదిల్ . న్యాయం గెలుస్తుందని నాకు తెలుసు.. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను.. అని రాఖీ సీరియ‌స్ అయింది.

అదిల్ ఖాన్ దురానీకి అనవసరంగా ఫుటేజీ ఇచ్చినందుకు రాఖీ సావంత్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆమెను ట్రోల్ చేయగా, మరికొందరు అతన్ని ఒంటరిగా వదిలేయాలని కోరారు. వీరి జీవితంలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. రాఖీ సావంత్ 90 ల చివరలో పరిశ్రమలో ప్ర‌వేశించింది. జోరు కా గులాం, జిస్ దేశ్ మే గంగా రెహతా హై, మై హూ నా స‌హా చాలా సినిమాల్లో కనిపించింది. బాలీవుడ్‌లో ఐటెం గర్ల్‌గా స్థిరపడింది. మాజీల మ‌ధ్య గొడ‌వ ఎప్పటికి చ‌ల్లారుతుందో చూడాలి.