Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరో.. ఒంటిపై నూలుపోగు లేకుండా?

బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ తో పాటు తెలుగులోనూ పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 1:09 PM GMT
బాలీవుడ్ హీరో.. ఒంటిపై నూలుపోగు లేకుండా?
X

బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ తో పాటు తెలుగులోనూ పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారి తనదైన యాక్షన్ తో అందరిని మెప్పించాడు. ఎప్పుడూ కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ భారీ యాక్షన్ సినిమాలు చేసి బాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. శక్తి, ఊసరవెల్లి, తుపాకీ వంటి సినిమాల్లో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.


ప్రస్తుతం ఈయన రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి 'షేర్ సింగ్ రానా' కాగా మరొకటి 'క్రాక్'. ఈ రెండూ యాక్షన్ థ్రిల్లర్స్ గా తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తన సినిమా షూటింగ్స్ నుంచి కాస్త విరామం తీసుకున్న విద్యుత్ జమ్వాల్ హిమాలయాలకు వెళ్లారు. అక్కడ ఒంటరిగా విహరిస్తున్నారు. తాజాగా తన హిమాలయ పర్యటనకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.


ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. అందుకు కారణం ఈ ఫోటోల్లో విద్యుత్ జమ్వాల్ తన ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనిపించడమే. ఒంటిపై దుస్తులు లేకుండా హిమాలయాల్లో సాధారణ వ్యక్తి మాదిరిగా తనకోసం వంట చేసుకుంటున్నాడు. ఈ ఫోటోల్లో ఒక యోగిలా దర్శనమిచ్చాడు. హిమాలయాల్లో పారుతున్న నీళ్లలో దిగిన సూర్య నమస్కారాలు చేయడం, కర్రలతో వంట చేయడం వంటివి ఈ ఫోటోల్లో కనిపించాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.


కాగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ తన సోషల్ మీడియాలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విద్యుత్ జమ్వాల్. ప్రతి ఏటా కనీసం వారం నుంచి పది రోజుల పాటు హిమాలయాల్లో సేద తీరుతాను. విలాస జీవితాన్ని ఓ సాధువుల జీవించడంలోనే సంతోషం ఉంటుంది. ప్రకృతిలోని ప్రతి అణువులో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిలో మరింత లగ్జరీ లైఫ్ కనిపిస్తుంది. ప్రకృతితో నన్ను నేను అన్వేషించుకోవడంలోనే అసలైన సంతృప్తి ఉంది. "నేను గత 14 ఏళ్ళుగా ఇలాంటి దైవచింతన గడుపుతున్నాను.

విలాసవంతమైన జీవితం నుంచి అటవీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు నా గురించి నేను తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ప్రకృతి నిశ్శబ్దంలో నా గురించి నేను తెలుసుకుంటున్నాను. కొద్ది రోజుల తర్వాత ఇక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తాను. కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతాను అని అన్నాడు.. అంతేకాకుండా చివర్లో తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను తీసింది అక్కడి స్థానిక గొర్రెల కాపరి మోహర్ సింగ్ అంటూ క్యాప్షన్ పెట్టాడు.