ట్రెండీ స్టోరి: ఖరీదైన వజ్రాలపై టాప్ 10 స్టార్ల మోజు
ఇటీవల కాలంలో మెన్ జ్యువెలరీ ట్రెండ్ బాగా పెరిగింది. వజ్రాలపై మోజు ఉన్న టాప్ మేల్ స్టార్స్ వివరాల్లోకి వెళితే..
By: Sivaji Kontham | 11 Feb 2026 9:38 AM ISTఖరీదైన వజ్రాలు, నగలు అంటే కేవలం హీరోయిన్లకే కాదు..! స్టార్ హీరోలకు కూడా విపరీతమైన పిచ్చి. ఇటీవల కాలంలో మెన్ జ్యువెలరీ ట్రెండ్ బాగా పెరిగింది. వజ్రాలపై మోజు ఉన్న టాప్ మేల్ స్టార్స్ వివరాల్లోకి వెళితే..
ఈ విషయంలో పటౌడీ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (నవాబ్ స్టైల్) ఎప్పుడూ ముందుంటారు. వీలున్న ప్రతి వేడుకలో ఖరీదైన వజ్రాల హారంతో కనిపించడం సైఫ్ స్టైల్. సైఫ్ ఇటీవల తన భార్య కరీనాతో కలిసి ఒక ఈవెంట్‌కు వెళ్లినప్పుడు టిఫనీ అండ్ కో బ్రాండ్‌కు చెందిన `బర్డ్ ఆన్ ఏ రాక్` ఆభరణంతో మెరిశారు. దీని విలువ సుమారు 42లక్షల నుండి 45 లక్షలు. ఇందులో 71 రౌండ్ డైమండ్స్, ఒక రూబీ (కన్నులాగా), ఒక భారీ పసుపు రంగు రత్నం ఉన్నాయి.
దాదాపు 7వేల కోట్లు పైగా నికర ఆస్తులు ఉన్న షారుఖ్ ఖాన్ పలు సందర్భాలలో ఖరీదైన వజ్రాల హారాలను కొనుగోలు చేసారు. అయితే వీటన్నిటి వివరాలు గోప్యంగా ఉన్నాయి. నిజానికి షారుఖ్ ఖాన్ వజ్రాల కంటే ఎక్కువగా లగ్జరీ వాచీలపై మక్కువ చూపిస్తారు. ఇటీవల ఒక అవార్డు ఫంక్షన్లో ఆయన ధరించిన రోలెక్స్ డేటోనా బ్లూ సఫైర్ వాచీ విలువ అక్షరాలా రూ. 13 కోట్లు. ఇందులో బెజెల్ చుట్టూ డైమండ్స్, బ్లూ సాఫైర్స్ పొదిగి ఉన్నాయి.
రణవీర్ ఫ్యాషన్ చాలా వెరైటీగా ఉంటుంది. ఆయనకు వజ్రాల నెక్లెస్‌లు అంటే చాలా ఇష్టం. అతడి వద్ద రూ. 2 కోట్ల విలువైన టిఫనీ డైమండ్ నెక్లెస్ ఉంది. అలాగే తన భార్య దీపికా పదుకొణెకు బహుమతిగా ఇచ్చిన ఎంగేజ్‌మెంట్ రింగ్ విలువ కూడా దాదాపు రూ. 1.3 కోట్ల నుండి 2 కోట్లు ఉంటుందని అంచనా. రణబీర్ తన భార్య ఆలియా భట్ కోసం ప్రత్యేకంగా 8 వజ్రాలు (రణబీర్ లక్కీ నంబర్ 8) పొదిగిన కస్టమైజ్డ్ రింగ్‌ను డిజైన్ చేయించారు. దీని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది.
టాలీవుడ్ - కోలీవుడ్ స్టార్స్ లో ఈ తరహా ఎవరున్నారు? అన్నది ఆరా తీస్తే..దక్షిణాది హీరోలు సాధారణంగా నగలు బయటకు ప్రదర్శించరు కానీ... ఖరీదైన వాచీలు, ఉంగరాల రూపంలో వజ్రాలను ధరిస్తారు. స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు అందరూ కోట్లు విలువ చేసే డైమండ్ స్టడెడ్ వాచీలను ధరిస్తారు. పటేక్ ఫిలిప్పే, ఆడెమార్స్ పిగెట్ బ్రాండ్ వజ్రాల వాచీలు ఉన్నాయి. ప్రభాస్ కూడా తన పారితోషికంలో కొంత భాగాన్ని విలువైన ఆస్తులు, నగలపై పెట్టుబడిగా పెడతారని టాక్.
కోలీవుడ్ హీరోలు సూర్య, అజిత్ చాలా సింపుల్‌గా ఉంటారు కానీ, విజయ్ ఖరీదైన డైమండ్ రింగ్స్ ధరిస్తుంటారు. నయనతార వద్ద అతిపెద్ద డైమండ్ రింగ్స్ కలెక్షన్ ఉంది. శాండల్వుడ్ లో యష్ ఈ తరహా ఫ్యాషన్ సెన్స్ పై ఇటీవల మక్కువ పెంచుకున్నాడని సమాచారం.
ముఖేష్ అంబానీ - నీతా అంబానీ వజ్రాల సామ్రాజ్యం:
అంబానీ కుటుంబం దగ్గర ఉన్న వజ్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో నీతా అంబానీ ధరించిన ఎమరాల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 500 కోట్లు అని టాక్. కోడలు శ్లోకా మెహతా కు ముఖేష్ అంబానీ గిఫ్ట్ ఇచ్చిన L డైమండ్ నెక్లెస్ విలువ రూ. 450 కోట్లు. ఇందులో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పసుపు వజ్రం ఉంది.
