Begin typing your search above and press return to search.

ప్రతి ఒక్కరూ వేలు పెడుతూ ఉంటారు... ఇదీ పరిస్థితి!

సన్నీ డియోల్‌ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'జాట్‌' సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   3 April 2025 3:00 AM IST
ప్రతి ఒక్కరూ వేలు పెడుతూ ఉంటారు... ఇదీ పరిస్థితి!
X

బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ను ఒకప్పుడు సౌత్‌ ఇండియన్ ఫిల్మ్‌ మేకర్స్‌ ఫాలో అయ్యే వారు. బాలీవుడ్‌ సినిమాల్లో నటించేందుకు సౌత్ సినీ స్టార్స్ ఆసక్తి చూపించే వారు. సౌత్‌ సినిమాలు అంటే బాలీవుడ్ వారికి చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. బాలీవుడ్‌లో నమోదు అవుతున్న సక్సెస్‌ రేటుతో పోల్చితే సౌత్ సినిమా ఇండస్ట్రీలో నమోదు అవుతున్న సక్సెస్‌ రేటు చాలా చాలా ఎక్కువ. అలాగే బాలీవుడ్‌ సినిమాలు సాధిస్తున్న వసూళ్లతో పోల్చితే సౌత్‌ సినిమాలు సాధిస్తున్న వసూళ్ల భారీగా ఉంటున్నాయి. సౌత్‌ ఇండియన్ సినిమాలు నార్త్‌ ఇండియాలోనూ మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నాయి. కానీ బాలీవుడ్‌ సినిమాలు సౌత్‌ ఇండియన్‌ భాషల్లో కనీసం విడుదల అయ్యే పరిస్థితి లేదు. బాలీవుడ్‌ ఈ స్థితికి చేరడానికి కారణం బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అని సీనియర్‌ హీరో సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సన్నీ డియోల్‌ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'జాట్‌' సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గదర్‌ 2 సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత హిట్‌ కొట్టిన సన్నీ డియోల్‌ 'జాట్‌'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అనే నమ్మకంతో ఉన్నాడు. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద యాక్షన్‌ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే గోపీచంద్‌ మలినేని చెప్పిన ఈ కథకు సన్నీ డియోల్‌ వెంటనే ఓకే చెప్పాడట. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ గురించి మాత్రమే కాకుండా సౌత్‌ సినిమా ఇండస్ట్రీ కూడా సన్నీ డియోల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల జాట్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సన్నీ డియోల్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌లో అభిరుచి తగ్గింది. అప్పట్లో మాదిరిగా మంచి కథలతో, మంచి స్క్రీన్‌ప్లేతో సినిమాలు రూపొందించాలని ఎవరూ కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ కమర్షియల్‌ సినిమాను తీయాలనే ఉద్దేశంతో పూర్తిగా దారి తప్పుతున్నారు. అప్పట్లో బాలీవుడ్‌ సినిమాలను చూసి సౌత్‌ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు చాలా విషయాలను నేర్చుకున్నారు. ఇప్పుడు వారు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ను క్రాస్‌ చేశారు. అందుకే మనం వాళ్ల సినిమాలను రీమేక్ చేయడంతో పాటు, ఆ ఇండస్ట్రీకి చెందిన దర్శకులతో, నటీ నటులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాం అన్నాడు.

బాలీవుడ్‌లో ఒక సినిమా రూపొందుతుంది అంటే దాని కథ విషయం మొదలుకుని షూటింగ్‌ ప్రారంభం అయ్యి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ వరకు ప్రతి ఒక్కరూ వేలు పెడుతూ ఉంటారు. కేవలం దర్శకుడు మాత్రమే సినిమాను పూర్తి చేయడు. చాలా మంది ఆ సినిమా మధ్యలో ఉన్న సమయంలో వచ్చి చేరుతూ ఉంటారు. దర్శకత్వం మొదలుకుని ప్రతి విషయంలోనూ కొందరు ఇన్వాల్వ్‌ కావడంతో మొదటికే మోసం వస్తుంది. సినిమా విషయంలో ఎప్పుడైనా కథ బెస్ట్‌గా ఉండాలి, సినిమాకు కథ ఎప్పుడూ నెం.1. అలాంటి కథ విషయంలో రకరకాల అభిప్రాయాలు చెబుతూ దర్శకుడు అనుకున్న కథను కాకుండా చివరకు మరో కథను సెట్స్‌ పైకి తీసుకు వెళ్తారు. అక్కడ కూడా మార్పులు చేస్తూనే ఉంటారు. గడచిన దశాబ్ద కాలంగా బాలీవుడ్‌ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కోవడంకు ప్రధాన కారణం ఇదే అంటూ సన్నీ డియోల్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యలు చాలా మంది ప్రముఖులు చేశారు. మరి ఇకపై అయినా బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ మేకింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటారా అనేది చూడాలి.