ముద్దుగుమ్మను నిలబెట్టేందుకు కష్టాలు..!
పీఆర్ టీంలు పుకార్లను పుట్టించడం, లేని ఆఫర్లు వచ్చినట్లుగా ప్రచారం చేయడం, లేని క్రేజ్‌ను ఉన్నట్లుగా చూపించడం వంటివి పీఆర్ టీం చేస్తారు.
By: Tupaki Desk | 15 July 2025 12:01 PM ISTఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు అనేది కేవలం సినిమాల్లో నటించడం ద్వారా మాత్రమే దక్కేది. ఒక సినిమాలో నటిస్తే, ఆ సినిమా హిట్ అయితే గుర్తింపు దక్కేది. నటిగా గుర్తింపు దక్కించుకోవాలంటే చాలా సినిమాలు చేయాల్సి వచ్చేది, కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలకే స్టార్‌డం దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కేవలం సినిమాల ద్వారా మాత్రమే గుర్తింపు దక్కేది. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే విధంగా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.
సౌత్ ఇండియాలో కాస్త తక్కువే అయినా బాలీవుడ్‌లో మాత్రం పీఆర్ మాయాజాలం ఎక్కువ అయింది. ఒక సినిమా గురించి అప్పట్లో పబ్లిసిటీకి పీఆర్ టీం ఉండేది. కానీ ఇప్పుడు వ్యక్తిగత పీఆర్ టీంలు ఎక్కువ అవుతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు తమ పబ్లిసిటీ కోసం నెలకు లక్షల్లో పీఆర్ టీం ద్వారా ఖర్చు చేస్తున్నారని ఒక జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. తక్కువ సమయంలోనే జనాల్లో గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా పీఆర్ టీంను ఆశ్రయించాల్సిందే. నెగటివ్ లేదా పాజిటివ్ ఏదో ఒక విధంగా మీడియాలో ఉంచే విధంగా, జనాలు మాట్లాడుకునే విధంగా సదరు పీఆర్ టీంలు పని చేస్తాయి. ఎలా మాట్లాడుకున్నా సక్సెస్ అయినట్లే అనేది వారి అభిప్రాయం.
పీఆర్ టీంలు పుకార్లను పుట్టించడం, లేని ఆఫర్లు వచ్చినట్లుగా ప్రచారం చేయడం, లేని క్రేజ్‌ను ఉన్నట్లుగా చూపించడం వంటివి పీఆర్ టీం చేస్తారు. అందరికీ అలాగే చేస్తారని కాదు కానీ బాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ దందా ఎక్కువగా నడుస్తుంది అనేది టాక్. బాలీవుడ్‌లో ఆ మధ్య ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ షనయా కపూర్‌ను జనాల మధ్య నిలబెట్టేందుకు పీఆర్ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఎంత చేసినా కూడా షనయా ఇప్పటి వరకు జనాల్లో మినిమం గుర్తింపు దక్కించుకోలేక పోతుంది. షనయా గురించి మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఏదో ఒక విషయం గురించి చర్చ జరిగేలా పీఆర్ టీం ప్రయత్నాలు చేస్తున్నారు.
సోనమ్ కపూర్, జాన్వీ కపూర్ ఇలా కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది ముద్దుగుమ్మల మాదిరిగానే షనయా కపూర్‌ను బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. షనయా నటన అద్భుతం అంటూ కొన్ని సార్లు, ఆమె బ్యాక్ గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినా, ఎలాంటి సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ మరోసారి నెట్టింట ఆమె గురించి కథనాలు వచ్చే విధంగా పీఆర్ టీం ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఒక మలయాళ సినిమా, ఒక హిందీ సినిమా చేస్తున్న షనయా ఆ సినిమాలు హిట్ అయితే ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి.
ఈమెకు తెలుగులో ఆఫర్లు వస్తే నటించేందుకు రెడీగా ఉందట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు నుంచి ఆమెకు ఆఫర్లు రావడం సాధ్యం కాదని, ఆమె మరికొన్ని సినిమాలు చేయాలి, అందులో ఒకటి రెండు హిట్స్ అయినా ఉండాలి. అప్పుడు షనయా కపూర్‌కి టాలీవుడ్ నుంచి పిలుపు వస్తుంది. ఈ లోపు ఆమె పీఆర్ టీం నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలా పీఆర్ టీంలు నిలబెట్టిన హీరోయిన్స్ బాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారు వరుస సినిమాలు చేస్తూ స్టార్‌డం దక్కించుకున్నారు. అదే జాబితాలో షనయా నిలుస్తుందేమో చూడాలి.
