Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో PRs గోల ఏంటి? ఫ్యాన్స్ ఏమంటున్నారు?

ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించి ఒకేసారి రకరకాల వార్తలు బయటకు రావడం వల్ల ఇదంతా పీఆర్ స్ట్రాటజీలో భాగమేనా అనే క్వశ్చన్లు వినిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   6 March 2026 12:26 PM IST
బాలీవుడ్ లో PRs గోల ఏంటి? ఫ్యాన్స్ ఏమంటున్నారు?
X

బాలీవుడ్‌ లో ఇటీవల పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్)ల చర్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి వస్తున్న వార్తలు, ప్రమోషన్లు చూసి గందరగోళం నెలకొంటోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించి ఒకేసారి రకరకాల వార్తలు బయటకు రావడం వల్ల ఇదంతా పీఆర్ స్ట్రాటజీలో భాగమేనా అనే క్వశ్చన్లు వినిపిస్తున్నాయి.

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ చుట్టూ ఇలాంటి చర్చలు ఎక్కువయ్యాయి. వీరిద్దరికి సంబంధించిన సినిమాలు, ప్రాజెక్టులు, వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో ఒకేసారి వివిధ రకాల వార్తలు వైరల్ కావడం గమనార్హం. కొందరు నెటిజన్లు కావాలనే సృష్టిస్తున్నారేమోనని అనుమానిస్తున్నారు. అధికారికంగా ఎలాంటి క్లారిట లేకపోయినా, అభిమానుల్లో మాత్రం చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఇక హీరోయిన్ల విషయంలోనూ ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా అవార్డులకు సంబంధించిన అంశంలో యామీ గౌతమ్, కృతి సనన్ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఎవరికీ అవార్డు రావాలి? ఎవరు ఎక్కువగా అర్హులు? అనే విషయాలపై విభిన్న కథనాలు, పోస్టులు వైరల్ అయ్యాయి. కొందరు ఇది అభిమానుల చర్చే అని అంటుండగా, మరికొందరు మాత్రం ఇది పీఆర్ టీంల మధ్య పోటీగా మారిందని అభిప్రాయపడుతున్నారు.

పీఆర్ టీమ్ ల వర్క్ సాధారణంగా ఒక నటుడు లేదా సినిమా గురించి పాజిటివ్ గా ప్రచారం చేయడం. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అదే ప్రచారం వివాదాలుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే సమయంలో విభిన్న కథనాలు బయటకు రావడం వల్ల అసలు నిజం ఏదో ప్రేక్షకులకు అర్థం కాకుండా పోతుందని నెటిజన్లు చెబుతున్నారు. కొంతమంది మాత్రం మరో యాంగిల్ లో కూడా మాట్లాడుతున్నారు.

బాలీవుడ్‌ లో ప్రముఖ పీఆర్ సంస్థలు చాలా మంది నటీనటులతో కలిసి పనిచేస్తుంటాయని వారు చెబుతున్నారు. అందువల్ల కొన్నిసార్లు ఒకే సంస్థకు చెందిన టీమ్ ల మధ్యనే పోటీ వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు. దాంతోనే కొన్ని కథనాలు కావాలనే వైరల్ అయ్యేలా చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఇలాంటి ప్రచారాలు మరింత వైరల్ అవుతున్నాయి.

ఒక చిన్న విషయం కూడా కొద్ది గంటల్లోనే పెద్ద చర్చగా మారుతోంది. అందులో నిజమెంత, ప్రచారమెంత అన్నది తేల్చుకోవడం ప్రేక్షకులకు కాస్త కష్టంగా మారింది. దీంతో ఒక సినిమాపై లేదా నటుడిపై పాజిటివ్ గా ప్రమోట్ చేయడం సహజమేనని అంటున్నారు. అయితే కావాలనే వివాదాలు సృష్టించి గందరగోళం కలిగించడం మాత్రం చిరాకు తెప్పిస్తుందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్‌ లో ఇప్పుడు పీఆర్ ల చర్యలు మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి.