జాట్ సక్సెస్ వేటలో సీక్వెల్ సర్ ప్రైజ్
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ “జాట్ 2” సినిమా ఉందని అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, సన్నీ డియోల్ మాస్ స్టైల్‌కు న్యాయం చేసే మరో ప్రయత్నమవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 17 April 2025 5:33 PM ISTబాలీవుడ్‌లో మాస్ సినిమాలకి కొత్త ఊపు తీసుకువచ్చిన చిత్రం జాట్. ఈ సినిమాతోనే దర్శకుడు గోపీచంద్ మలినేని తన తెలుగులో చూపించిన మాస్ ప్యాకేజ్‌ను హిందీ తెరపై కూడా చాటుకున్నారు. సన్నీ డియోల్ నటన, యాక్షన్ మాస్ అటిట్యూడ్, నార్త్ ప్రేక్షకులను గట్టిగానే ఎట్రాక్ట్ చేశాయి. మాస్ ప్రేక్షకుల నుంచి బీ సీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.
ఇప్పటికే జాట్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంటూ దూసుకుపోతోంది. బాలీవుడ్‌కు మాస్ కంటెంట్‌తో మరోసారి గట్టి హిట్ ఇచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు 100 కోట్ల మార్క్‌ను టచ్ చేసే దిశగా దూసుకెళ్తోంది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోయినా స్ట్రాంగ్ మాస్ కంటెంట్ ఉండడంతో మౌత్‌టాక్ బాగా పెరిగింది. ఈ సమయంలోనే మేకర్స్ నుంచి సీక్వెల్ అనౌన్స్మెంట్ రావడంతో హైప్ మరింత పెరిగిపోయింది.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ “జాట్ 2” సినిమా ఉందని అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, సన్నీ డియోల్ మాస్ స్టైల్‌కు న్యాయం చేసే మరో ప్రయత్నమవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జాట్ 2 కోసం స్క్రిప్ట్ ఇప్పటికే ప్రిపరేషన్ స్టేజ్‌లో ఉందని తెలుస్తోంది. మొదటి భాగానికి ఉన్న కంటెంట్ మాస్‌తో పాటు ఎమోషనల్ పాయింట్స్ కూడా బాగా కనెక్ట్ అవ్వడంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
జాట్ చిత్రం ప్రమోషన్ల విషయంలో కాస్త నెమ్మదిగా ఆరంభమైనా, సినిమా విడుదలయ్యాక ఫలితాలు హైలెట్ అయ్యాయి. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఇచ్చిన ఆదరణ చూసి మేకర్స్ ఇప్పుడు ముందుగానే సీక్వెల్ ప్రకటించడం వెనుక వ్యూహం ఉన్నట్టు అనిపిస్తోంది. సీక్వెల్‌లో మరింత స్టైల్, మాస్ యాక్షన్, కమర్షియల్ హైప్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అందులోనూ సన్నీ డియోల్ మళ్లీ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.
ఇక తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక గోపీచంద్ మలినేని –సన్నీ డియోల్ కాంబోకు మంచి క్రేజ్ రావడం, మైత్రి బ్యానర్ ప్రొడక్షన్ విలువలు.. ఇవన్నీ కలసి జాట్ సినిమాని ఓ మాస్ బ్లాక్ బస్టర్‌గా నిలిపాయి. మరి సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు దర్శకుడు గోపిచంద్ కు తెలుగు హీరోల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. బాలకృష్ణతో అతను మరో సినిమా చేయాల్సి ఉంది. ఇక జాట్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.
