బాలీవుడ్ లో కొత్త ట్రెండ్
ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఓ కొత్త ధోరణి కనిపిస్తుందని ఓ వర్గం ఆడియన్స్ సోషల్ మీడియాలో ఆందోళనలను రేకెత్తిస్తున్నారు.
By: Tupaki Desk | 9 July 2025 8:30 AM ISTరణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ సినిమా నుంచి రీసెంట్ గా అతని బర్త్ డే సందర్భంగా మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ఆడియన్స్ లో మంచి ఆసక్తిని రేకెత్తించడంతో పాటూ సినిమాపై హైప్ ను కూడా పెంచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఓ కొత్త ధోరణి కనిపిస్తుందని ఓ వర్గం ఆడియన్స్ సోషల్ మీడియాలో ఆందోళనలను రేకెత్తిస్తున్నారు.
బాలీవుడ్ లోని స్టార్లంతా ఇప్పుడు కేవలం మూడు జానర్ల సినిమాల్లోనే నటిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యాక్షన్ సినిమాలు, జియోపొలిటికల్ థ్రిల్లర్లు లేదంటే మతపరమైన సినిమాలు. ఈ మూడు జానర్లలోనే బాలీవుడ్ స్టార్లు తిప్పి తిప్పి సినిమాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ ఏడాది మొదట్లో విక్కీ కౌశల్ ఛావా సినిమా చేసి ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలుసు.
మొన్నా మధ్య రణ్‌బీర్ కపూర్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన యానిమల్ చేశారు. ఆ సినిమాలో యాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు రణ్‌బీర్ చేస్తున్న రామాయణ సినిమా మతపరమైన సినిమా. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ సినిమాతో తన ఇమేజ్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని ట్రై చేసినప్పటికీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
సికిందర్ డిజాస్టర్ తర్వాత సల్మాన్ ఖాన్ ఇప్పుడు బాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై ఫోకస్ చేయగా ఆ సినిమా ఇండియా- చైనా మధ్య ఉన్న రియల్ లైఫ్ కాన్‌ఫ్లిక్ట్ పై తెరకెక్కుతుంది. పఠాన్, జవాన్ సినిమాల కోసం షారుఖ్ ఖాన్ కూడా అదే దారిలో వెళ్లారు. వీరు మాత్రమే కాకుండా ఇతర నటులు కూడా అదే బాటలో వెళ్తున్నారు. రీసెంట్ గా భూల్ చుక్ మాఫ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్న రాజ కుమార్ రావు త్వరలోనే మాలిక్ అనే యాక్షన్ మూవీతో రాబోతున్నారు.
ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ కూడా ధురంధర్ సినిమాతో ఆ దారిలోకి వెళ్తుండటం చూసి ఎందుకు బాలీవుడ్ హీరోలు ఇలా చేస్తున్నారని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ మూడు జానర్లు తప్ప ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకొచ్చే జానర్లు లేవా అని వారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరి ఈ కొత్త ట్రెండ్ కు బాలీవుడ్ హీరోలు ఎప్పుడు స్వస్తి చెప్తారో చూడాలి.
