నిర్మాతగా, నటుడిగా ఫెయిల్ ఫెయిల్...!
బాలీవుడ్ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కరోనా తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీ కాస్త కుదుటపడ్డట్లు అనిపిస్తున్నప్పటికీ బాలీవుడ్ మాత్రం ఇప్పటికీ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది.
By: Tupaki Desk | 3 Dec 2025 12:00 AM ISTబాలీవుడ్ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కరోనా తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీ కాస్త కుదుటపడ్డట్లు అనిపిస్తున్నప్పటికీ బాలీవుడ్ మాత్రం ఇప్పటికీ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా సమయంలో ఇండస్ట్రీకి దూరమైన ప్రేక్షకులు ఇప్పటి వరకు మళ్లీ దగ్గర కాలేదు. హిందీ సినిమాలపై ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి తగ్గుతూ వస్తోంది. కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించినప్పటికీ వాటికి థియేటర్లో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఏడాదిలో హిట్ సినిమాలు సంఖ్య సింగిల్ డిజిట్ దాటడం లేదు. ఈ పరిస్థితి ఇండస్ట్రీ యొక్క అత్యంత దారుణమైన పరిస్థితికి అర్థం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మినిమం గ్యారంటీ అంటూ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో వచ్చిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు కనిపించడం లేదు. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఫిలిం మేకర్స్ ఇప్పుడు కనీసం సక్సెస్ రాకపోవడంతో సినిమాలు తీసి పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఫిలిం మేకింగ్ కి దూరంగా ఉంటున్నారు.
బాలీవుడ్ నిర్మాత ఫర్ఖాన్ అక్తర్...
కొందరు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు, మరికొందరు ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమాలు తీయకుండా తమ వంతు బాధ్యత అన్నట్లుగా ఏదో ఒక రంగంలో రిస్క్ లేకుండా కొనసాగుతున్నారు. నటీనటులు ఒకప్పటి మాదిరిగా ఏడాదిలో లెక్కకు మించి సినిమాలు చేయడం లేదు. అలాగే నిర్మాతలు కూడా సినిమాల మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతి కొద్ది మంది మాత్రమే బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి నిర్మాత ఫర్హాన్ అక్తర్ సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి ఉండేది. ఆయన దర్శకత్వంలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి, అవి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక నటుడిగా చాలా సినిమాలే ఆయన చేయడం జరిగింది. ఆయన ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి, కానీ కాలం అన్నింటిని మార్చేస్తుంది. ఎక్కడికక్కడ కనెక్షన్ కట్ అన్నట్లుగా ఫర్హాన్ కెరియర్ సాగుతూ వస్తోంది. ఇప్పటికే దర్శకత్వాన్ని వదిలేశాడు, సినిమాలకు రచయితగా వ్యవహరించడం లేదు. నటుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ దక్కించుకోలేక పోతున్నాడు.
120 బహదూర్ సినిమా....
దశాబ్ద కాలంగా ఫర్హాన్ అక్తర్ హిట్ అనే పదాన్ని చూడలేక పోతున్నాడు. ఆయన నిర్మాణంలో వచ్చిన చాలా సినిమాలు ఫ్లాప్ గా నిలుస్తున్నాయి, కొన్ని సినిమాలు పరవాలేదు అన్నట్లుగా ఉన్న కలెక్షన్స్ పరంగా అవి ఫ్లాప్ సినిమాలుగానే మిగిలాయి. అందుకే ఫర్హాన్ సినిమాలంటే ఒకప్పుడు క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు ఆయన సినిమాలను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఫర్హాన్ నటించిన నిర్మించిన 120 బహదూర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశభక్తి ఇతివృత్తంతో వస్తున్న సినిమాలు సక్సెస్ అవుతున్న ఈ సమయంలో ఫర్హాన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ సినిమాని చేయడం జరిగింది. విభిన్నమైన కథనం అంటూ ప్రమోషన్ సమయంలో తెగ ప్రచారం చేయడం జరిగింది. కానీ సినిమా ఫర్హాన్ గత చిత్రాల మాదిరిగానే ఏ మాత్రం ఆకట్టుకోలేక పోతుంది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కనీసం రెండు వారాలు కూడా థియేటర్లో ఆడలేక పోయింది. వంద కోట్లకు పైగా ఖర్చు చేశారంటూ ప్రచారం జరుగుతున్న ఈ సినిమాకు థియేటర్ల ద్వారా వచ్చింది కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ నెంబర్స్ ఆయన సినిమా ఏ స్థాయిలో ఫ్లాప్ గా నిలిచిందో చెప్పకనే చెబుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోల పరిస్థితి...
యాక్షన్ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు కామెడీ సినిమాలు ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ బాలీవుడ్ వారు సక్సెస్ సొంతం చేసుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నారు. ఫర్హాన్ సైతం గత దశాబ్ద కాలంగా రకరకాల సినిమాలను నిర్మించడం ద్వారా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నాడు, కానీ ఆయనకు ప్రతి సినిమా నిరాశనే మిగులుస్తూ వచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే ఫర్హాన్ నిర్మాతగా సినిమాలను నిర్మించడం మానేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన సన్నిహితులు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తాజాగా వచ్చిన సినిమా విషయంలో ఆయన చాలా నిరుత్సాహంగా ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బాలీవుడ్లో ఇలాంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో కామన్ గా చూస్తూ ఉన్నాం. కానీ ఫర్హాన్ దశాబ్ద కాలంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన శకం ముగిసింది అంటూ కొందరు విశ్లేషణ చేస్తున్నారు. కానీ ఫర్హాన్ మాత్రం ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగిందేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడని తెలుస్తోంది. వాటితో అయినా ఈ నిర్మాత సక్సెస్ చూస్తాడా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
