Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ సెలబ్రిటీ వ్యాపార‌వేత్త‌లు వీళ్లే

సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న సెల‌బ్రిటీల సంపాద‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాలీవుడ్ లో ఇది ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 3:00 PM IST
బాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ సెలబ్రిటీ వ్యాపార‌వేత్త‌లు వీళ్లే
X

సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న సెల‌బ్రిటీల సంపాద‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాలీవుడ్ లో ఇది ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా సెల‌బ్రిటీలు కోట్ల‌లో సంపాదిస్తుంటారు. అయితే కొంత‌మంది సెల‌బ్రిటీలు అక్క‌డితో ఆగ‌కుండా వ్యాపార ప్ర‌పంచంలోకి కూడా అడుగుపెట్టి స‌క్సెస్ అవుతున్నారు.

బాలీవుడ్ లో స్టార్ సెల‌బ్రిటీలంద‌రికీ ర‌క‌ర‌కాల సైడ్ బిజినెస్‌లు ఉండ‌గా వారిలో దీపికా ప‌దుకొణె, స‌ల్మాన్ ఖాన్, కృతి స‌న‌న్, క‌త్రినా కైఫ్, అలియా భ‌ట్, ప్రియాంక చోప్రా, ర‌ణ్‌బీర్ క‌పూర్ మ‌రియు హృతిక్ రోష‌న్ లు టాప్ లో ఉన్నారు. ప‌లు ర‌కాల బిజినెస్‌ల‌తో జ‌నాల‌ను ఎట్రాక్ట్ చేస్తూ బాలీవుడ్ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్లుగా నిలుస్తున్నారు.

దీపికా ప‌దుకొనే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాకుండా ఫిట్‌నెస్ ఔత్సాహికురాలిగా, ఫ్యాష‌న్ ఐకాన్ గా మంచి గుర్తింపు ఉంది. దీపికా త‌న క్రేజ్, అందానికి తగ్గ‌ట్టే 82°E అనే స్కిన్ కేర్ బ్రాండ్ ను మొద‌లుపెట్టి మంచి ఎంట‌ర్‌ప్రెన్యూర్ గా పేరు తెచ్చుకుంది. దీపికా మొద‌లుపెట్టిన ఈ బ్రాండ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగానే కాకుండా నిర్మాత‌గా, బిజినెస్ మ్యాన్ గా ప‌లు రంగాల్లో రాణిస్తున్నాడు. వివిధ బిజినెస్‌ల‌తో పాటూ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో న‌టించి బాగా సంపాదిస్తున్న స‌ల్మాన్, బీయింగ్ హ్యూమ‌న్ పేరుతో క్లాథింగ్ బ్రాండ్ ను మొద‌లుపెట్టి అందులో స‌క్సెస్ అయ్యాడు. దీంతో పాటూ యాత్ర కంపెనీలో స‌ల్మాన్ కు 5% వాటా ఉంది.

హీరోయిన్ గా కృతి స‌న‌న్ ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌మోష‌న్స్ చేస్తూ బాగా ఆర్జించిన కృతి రీసెంట్ గా మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా కు కూడా ప్ర‌చార‌క‌ర్త‌గా మారింది. వీటితో పాటూ కృతికి హైఫెన్ అనే బ్యూటీ కేర్ బ్రాండ్ ను స్టార్ట్ చేసి మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ గా రాణిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ నైకా తో క‌లిసి కే బ్యూటీ అనే బ్యూటీ బ్రాండ్ ను మొద‌లుపెట్టింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి మేక‌ప్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న క‌త్రినా లాంగ్ లాస్టింగ్ మేక‌ప్ ఉత్ప‌త్తుల‌ను అందిస్తూ త‌న బిజినెస్‌లో స‌క్స‌స్‌ఫుల్ లో కొన‌సాగుతుంది.

అలియా భ‌ట్ 2020లో ఎడ్ ఎ మ‌మ్మా బ్రాండ్ పేరుతో బిజినెస్ ను స్టార్ట్ చేసింది. ఇందులో పిల్లలు మ‌రియు త‌ల్లుల బ‌ట్టలు దొరుకుతాయి. ఈ బ‌ట్ట‌ల‌ను ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే ప‌దార్థాల‌ను వాడ‌కుండా త‌యారు చేస్తారు. దుస్తుల‌తో పాటూ పిల్ల‌ల బొమ్మ‌లు వారికి అవ‌స‌ర‌మైన వాటిని కూడా ఎడ్ ఎ మ‌మ్మా ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ బ్రాండ్ అలియాకు ఏటా ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది.

ఇక ప్రియాంక చోప్రా అనామ‌లి అనే హెయిర్ కేర్ బ్రాండ్ ను స్థాపించి దాంతో బాగా స‌క్సెస్ అయింది. త‌క్కువ ధ‌ర‌లో మ‌ధ్య త‌ర‌గ‌తికి అందుబాటులో ఉండే ఉత్ప‌త్తుల‌ను అందిస్తూ వ‌స్తున్న ప్రియాంక త‌న బ్రాండ్ ఉత్ప‌త్తుల కోసం స‌ముద్రం నుంచి వెలికితీసిన ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను రీసైకిల్ చేసి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు తోడ్ప‌డుతుంది. అనామ‌లి ద్వారా ప్రియాంక బాగానే సంపాదిస్తుంది.

బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్‌స‌మ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టుడిగా ఎంతో బిజీగా ఉంటూనే మ‌రోవైపు ప‌లు బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేస్తున్నాడు. దీంతో పాటూ ఎప్ప‌ట్నుంచో త‌న పేరుతో సొంత బ్రాండ్ ను ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌తో ఆర్క్స్ పేరుతో స్నీక‌ర్ బ్రాండ్ ను ఏర్పాటు చేసి స‌క్సెస్‌ఫుల్ గా దాన్ని ర‌న్ చేస్తున్నాడు.

క‌హోనా ప్యార్ హై తో కెరీర్ ను స్టార్ట్ చేసిన హృతిక్ రోష‌న్ కు HRX అనే ప్ర‌ముఖ స్పోర్ట్ క్లాథింగ్ బ్రాండ్ ఉంది. దీని ద్వారా హృతిక్ కు భారీ ఆదాయం సంపాదిస్తున్నాడు. దీంతో పాటూ హృతిక్ కు క‌ట్ అనే జిమ్ కూడా ఉంది.