సూపర్ స్టార్ మూవీ... మరీ ఇంత దారుణమా?
టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. కానీ బాలీవుడ్ సినిమాల సక్సెస్ రేటు అంతకంతకు తగ్గుతూ వస్తుంది.
By: Tupaki Desk | 19 Jun 2025 12:21 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే కాకుండా క్రేజ్ ఉన్న టైర్ 2 హీరోల సినిమాలకు కూడా మంచి బిజినెస్ జరగడంతో పాటు, డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు కావడం మనం చూస్తూ ఉంటాం. అంతా కొత్త వారు నటించిన సినిమాలకు పబ్లిసిటీ సాలిడ్‌గా చేస్తే టాలీవుడ్ ప్రేక్షకులు ఆధరించి భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజు వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డ్‌లను నమోదు చేస్తున్నాయి. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ సినిమాలు మినిమం ఓపెనింగ్ కలెక్షన్స్‌ను నమోదు చేయలేక పోతున్నాయి. దాంతో లాంగ్ రన్ వసూళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి.
టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. కానీ బాలీవుడ్ సినిమాల సక్సెస్ రేటు అంతకంతకు తగ్గుతూ వస్తుంది. ఈమధ్య కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం మనం చూశాం. గత ఏడాది కొన్ని సినిమాలు పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. ఈ ఏడాదిలో ఛావా, హౌస్‌ఫుల్ సినిమాలు మినహా మరే సినిమాలు భారీ వసూళ్లు నమోదు చేయలేదు. ఇప్పుడు అందరి దృష్టి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ మూవీ 'సితారే జమీన్ పర్' పై ఉంది. దాదాపుగా దశాబ్ద కాలంగా ఆమీర్ ఖాన్ సినిమాలు హిట్‌కు నోచుకోవడం లేదు. అయితే ఈ సినిమా తన సూపర్ హిట్ తారే జమీన్ పర్‌కి సీక్వెల్ అంటూ ప్రచారం చేయడం వల్ల కాస్త బజ్ క్రియేట్ అయింది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా సితారే జమీన్ పర్ సినిమా కోసం ఆమీర్ ఖాన్ అత్యధికంగా సమయం కేటాయించి ప్రమోషన్ చేస్తున్నాడు. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికీ ఆమీర్‌ఖాన్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నాడు. గతంలో ఎప్పుడూ ఏ సినిమాకు ఇవ్వనన్ని ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం ఆమీర్ ఖాన్ ఇచ్చాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అడిగిన వారికి కాదు అనకుండా ఆమీర్ ఖాన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సినిమా గురించి గొప్పగా చెప్పడం కోసం చాలా పాట్లు పడుతున్నాడు. మరో వైపు పీఆర్ టీం సైతం సినిమాకు బజ్ క్రియేట్ చేయడం కోసం కొన్ని పుకార్లు సైతం క్రియేట్ చేస్తుంది. అయినా ఫలితం దక్కడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమా మరికొన్ని గంటల్లోనే విడుదల కాబోతుంది. అయినా కూడా ఇప్పటి వరకు మినమం అడ్వాన్స్ బుకింగ్ నమోదు కాలేదు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు ప్రీ బుకింగ్ కాకుంటే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఈ సినిమాకు వస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మినిమం అడ్వాన్స్ బుకింగ్ కాకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల వచ్చిన హౌస్‌ఫుల్ 5 సినిమాకు సైతం పెద్దగా బుకింగ్ నమోదు కాలేదు. కానీ లాంగ్ రన్‌లో సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.
ఇప్పుడు ఈ సినిమాకు సైతం అలాంటి పరిస్థితి ఉంది. కానీ లాంగ్ రన్‌లో కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సూపర్ స్టార్ సినిమాకు మరీ ఇంత దారుణమైన అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఊహించలేదని పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమీర్ ఖాన్ ఈ సినిమాతో మరోసారి విఫలం అయితే కచ్చితంగా ఆయన మార్కెట్ మరింత డౌన్ కావడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
