మొదటి పెళ్లి వైఫల్యంతో పెళ్లి మాటెత్తని సీనియర్లు!
దంపతుల మధ్య కలహాలు సహజం. సర్దుకుపోతోనే జీవితం ముందుకు సాగుతుంది. లేదంటే ఆ ధాంపత్య జీవితం పెటాకులుగానే మారుతుంది.
By: Tupaki Desk | 17 July 2025 8:00 AM ISTదంపతుల మధ్య కలహాలు సహజం. సర్దుకుపోతోనే జీవితం ముందుకు సాగుతుంది. లేదంటే ఆ ధాంపత్య జీవితం పెటాకులుగానే మారుతుంది. అదీ సెలబ్రిటీ అయినా...సామాన్యుడి జీవితంలోనైనా ఒకేలా పని చేస్తుంది. అయితే ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత రెండవ పెళ్లి విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలో కొందరు రెండవ పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభిస్తే మరికొంత మంది రెండవ పెళ్లికి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంటారు.
అలాంటి బాలీవుడ్ సీనియర్ నటీమణులు రేఖ, మనీషా కోయిరాలా, కరిష్మా కపూర్, పూజాభట్, చిత్రాంగదా సింగ్. వీళ్లంతా ఒకసారి వివాహం చేసుకుని విడిపోయిన వారే. కానీ రెండవ పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి ఆలోచన చేయకుండా కెరీర్ ని అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు. మనీషా కోయిరాలా 2010 లో నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహాల్ ను వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన ఆరు నెలలకే వివాదాలు మొదలయ్యాయి. దీంతో 2012 లో విడాకులతో వేరయ్యారు.
ఆ తర్వాత రెండవ పెళ్లి జోలికి వెళ్లలేదు. బాలీవుడ్ నటి పూజాభట్ 2003లో వ్యాపార వేత్త మనీష్ మఖజాను వివాహం చేసుకున్నారు. కానీ 11 ఏళ్ల కాపురం అనంతరం 2014లో విడిపోయారు. పూజాభట్ కూడా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మరో బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ 2001 లో గోల్పర్ జ్యోతిరంధావాను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు కలడు. కానీ 2013లో వేరవ్వగా 2014లో విడాకులు మంజూరయ్యాయి. అప్పటి నుంచి సినిమాలు తప్ప పెళ్లి ఆలోచన లేకుండానే ముందుకెళ్తున్నారు.
అలాగే కరిష్మా కపూర్ 2003 లో బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. కానీ కొంత కాలం అనంతరం 2014లో విడిపోయారు. ప్రస్తుతం పిల్లలతో కరష్మా కపూర్ కలిసి జీవిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నట దిగ్గజం రేఖ 1990 లో వ్యాపార వేత్త ముఖేష్ అగర్వాల్ ను వివాహం చేసుకున్నారు. ఏడాది కాపురం అనంతరం 1991లో ముఖేష్ ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఆ తర్వాత రేఖ రెండవ వివాహం చేసు కోలేదు. ఇంకా చాలా మంది బాలీవుడ్ నటీమణులు రెండవ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నారు.
