బాలీవుడ్ భామల పోటీ చాలా టఫ్ అంతే..?
ఒకప్పుడు ప్రాంతీయ సినిమాల్లో నటించాలని బాలీవుడ్ భామలని అడిగితే భారీ రెమ్యునరేషన్ అడిగేవారు.
By: Tupaki Desk | 30 April 2025 10:50 AM ISTఒకప్పుడు ప్రాంతీయ సినిమాల్లో నటించాలని బాలీవుడ్ భామలని అడిగితే భారీ రెమ్యునరేషన్ అడిగేవారు. దానికి మన మేకర్స్ షాక్ అయ్యే వారు. అంతేకాదు కొంతమంది మొహం మీదే ఇక్కడ సినిమాలు చేయలేం అని చెప్పేవారు. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా చేస్తున్న హంగామా చూసి బీ టౌన్ భామలు తెలుగు పరిశ్రమకు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఇక్కడ నుంచి ఏదైనా ఛాన్స్ వస్తే చాలు వెంటనే ఓకే చేస్తున్నారు.
బాలీవుడ్ భామల్లో ఈ మార్పు ఊహించినదే. ఎవరు చేసినా ఎలా చేసినా రెమ్యునరేషన్ కోసమే. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు ఈక్వెల్ బడ్జెట్ తోనే తెలుగు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అందుకే బాలీవుడ్ భామలు తెలుగు సినిమాల్లో చేస్తున్నారు. దిశా పటాని, అలియా భట్, దీపిక పదుకొనె, కియరా అద్వాని, జాన్వి కపూర్ ఇలా అందరు టాలీవుడ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు.
ఐతే నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మేమంటే మేం అంటూ బాలీవుడ్ భామలు పోటీ పడుతున్నారు. తెలుగులో స్టార్ హీరోలంతా తమ టార్గెట్ పాన్ ఇండియా సినిమాలే అని ఫిక్స్ అయి పనిచేస్తున్నారు. ఈ సినిమాల్లో ఛాన్స్ ల కోసం బాలీవుడ్ భామలను అడిగితే వచ్చిన ఈ అవకాశం తాము వదులుకుంటే మరో హీరోయిన్ అందుకుంటుందని ఓకే చేస్తున్నారు. అంతేకాదు రెమ్యునరేషన్ లో కూడా అక్కడ వారు తీసుకుంటున్నంత ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారు.
తెలుగు సినిమా ఆఫర్ అంటే చాలు బాలీవుడ్ హీరోయిన్స్ అంతా కూడా అలర్ట్ అవుతున్నారు. వారు చేస్తున్న సినిమాలతో పాటు వీటిని కూడా వారి ఖాతాలో ఉండేలా చూసుకుంటున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బాలీవుడ్ భామలంతా కూడా తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగు సినిమాల్లో అందాల బీ టౌన్ హీరోయిన్స్ సందడి చేయడం ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు. RRR లో అలియా, కల్కి 1లో దీపిక, దేవర తో జాన్వి కపూర్, గేమ్ ఛేంజర్ తో కియరా ఇలా అందరు తెలుగు సినిమాలు చేశారు. కల్కి 2లో కూడా దీపిక ఉంటుంది. రాజమౌళి మహేష్ సినిమాలో ప్రియాంకా చోప్రా నటిస్తుంది. సో అందరికీ టాలీవుడ్ ఛాన్స్ అన్నది ఒక క్రేజీగా మారిందని చెప్పొచ్చు.
