Begin typing your search above and press return to search.

శోభితా బ్లాస్టింగ్ గ్లామర్.. స్టన్నింగ్ లుక్స్!

టాలెంటెడ్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల, మోడలింగ్‌ నుంచి సినిమాల వరకు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   21 April 2025 7:29 AM
శోభితా బ్లాస్టింగ్ గ్లామర్.. స్టన్నింగ్ లుక్స్!
X

టాలెంటెడ్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల, మోడలింగ్‌ నుంచి సినిమాల వరకు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘మేడిన్ హేవెన్’ లాంటి వెబ్‌ సిరీస్‌లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతోంది. ఆమె నటనలో అందం కన్నా ఇన్టెలిజెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల ఆమె నాగచైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు పర్సనల్ లైఫ్ హ్యాపీగా కొనసాగుతుండగా, మరోవైపు కెరీర్ కూడా స్టెడీగానే సాగుతోంది.


ఇటీవల శోభితా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న తాజా ఫోటోషూట్ చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. గోల్డెన్ గౌన్‌లో మెరిసిపోతూ ఇచ్చిన అందమైన లుక్‌తో గ్లామర్ డోస్ పెంచేసింది. వెనుక అద్దంలో ప్రతిబింబంగా కనిపిస్తున్న ఆమె శరీర సొగసులు నెటిజన్లను మైమరపిస్తున్నాయి. ఫోటోలు చూస్తుంటే హాలీవుడ్ స్టైల్‌ గ్లామర్ ఫిల్టర్‌లా అనిపిస్తోంది.


ఈ లుక్‌తో శోభితా కేవలం గ్లామరస్ లుక్‌ మాత్రమే కాదు, స్టైలిష్ ప్రెజెన్స్‌ కూడా ఎంత ఉన్నదో నిరూపించింది. రెడ్ కార్పెట్ వేదికను తలపించే ఈ ఫొటోషూట్‌లో ఆమె ధైర్యంగా కనిపించింది. ఇందులోని కొన్ని ఫొటోల్లో ఆమె వెనుక ఉన్న బ్లాస్టింగ్ బ్యాక్గ్రౌండ్, ఆమె స్టైల్‌కు హై వోల్టేజ్ మూడ్‌ను జత చేసింది. 'ఫ్యాషన్‌తోనే ఫైర్ బ్రాండ్' అనే క్యాప్షన్ పెట్టినా తప్పు లేదు.


అయితే ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఒక్కసారి కాదు పదిసార్లు స్క్రోల్ చేస్తున్నారు. " ఆహా ఏమి లుక్.. గ్లామర్ దేవత!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, శోభితా ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో పాటు ఓ తెలుగు సినిమా కూడా ఒప్పుకున్నట్లు టాక్. అలాగే నాగచైతన్యతో కలిసి ఓ బ్రాండ్ ప్రమోషన్‌లోనూ పాల్గొననున్నారట. ఈ స్టన్నింగ్ లుక్‌తో మరోసారి శోభితా సోషల్ మీడియాలో జోరు చూపించింది.