Begin typing your search above and press return to search.

రాజమౌళిని త‌ప్పించుకు తిరుగుతున్న పీసీ!

ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రాకు అర్థ‌మైన‌ట్టుంది.

By:  Tupaki Desk   |   24 May 2025 12:00 PM IST
రాజమౌళిని త‌ప్పించుకు తిరుగుతున్న పీసీ!
X

ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రాకు అర్థ‌మైన‌ట్టుంది. జ‌క్క‌న్న ఎదుటివారికి అస్స‌లు స్పేస్ ఇవ్వ‌డు. ఒక‌సారి స్పేస్ ఆక్ర‌మిస్తే ఇక అంతే సంగ‌తి. పాపం.. ఎంతో స్వేచ్ఛ‌గా హాలీవుడ్ సినిమాల్లో రోజుకు ఆరు గంట‌లే ప‌ని చేసే ప్రియాంక చోప్రాకు ఇప్పుడు ముప్పు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. రోజంతా జ‌క్క‌న్న‌కు కావాల్సిన విధంగా, సెట్లో కుస్తీలు ప‌ట్టాల్సి ఉంటుంది కాబ‌ట్టి, ఆ కాక ఎలా ఉంటుందో ఇప్ప‌టికే ప్రియాంక చోప్రా అర్థం చేసుకుంది.


అందుకే ఇప్పుడు వీలున్నంత వ‌ర‌కూ రాజ‌మౌళి నుంచి త‌ప్పించుకుని తిరుగుతోంద‌ని గుస‌గుస‌. ఇదిగో ఇప్ప‌టికిప్పుడు అక‌స్మాత్తుగా ప్రియాంక చోప్రా విదేశీ వెకేష‌న్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. పీసీ ఇన్ స్టా ఫీడ్ చూస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఓవైపు బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ లో నిండా మునిగి తేల్తున్న ఈ బ్యూటీ, దూరంగా కొండ‌ల‌పై నుంచి ర‌గులుతున్న కాష్టాన్ని, పొగ‌ను చూపిస్తూ కొన్ని స్నాప్స్‌ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.


ఇంత‌కీ పీసీ ఎక్క‌డ ఉంది? అంటే.. 24 మే 2025 కాల‌మానం ప్ర‌కారం.. ప్రియాంక చోప్రా ఇటలీ- సిసిలీలోని టోర్మినా(అగ్నిప‌ర్వ‌తం)కు చేరువ‌లో ఉంది. తన పర్యటన నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు దీనిని లీక్ చేసాయి. పీసీ షేర్ చేసిన ఫోటోల్లో బికినీ టాప్, బ్లాక్ సన్ గ్లాసెస్, తెల్లటి టోపీ ధరించిన సెల్ఫీ హైలైట్ గా నిలిచింది. రెండవ ఫోటోలో బీచ్ వ్యూని ఆవిష్క‌రిస్తూ..తన టోన్డ్ లెగ్స్ సౌంద‌ర్యాన్ని ప్రియాంక చోప్రా ఎలాంటి భేష‌జానికి పోకుండా ప్రదర్శించింది. అంద‌మైన పువ్వులు చెట్లు ఉన్న ఫోటోల‌ను కూడా పీసీ షేర్ చేసింది. ఒక వీడియోలో దూరంగా పర్వతాలతో సుందరమైన డ్రైవ్‌ను ఆస్వాధిస్తూ క‌నిపించింది. అంతేకాదు.. ఒక అగ్నిపర్వతం పొగ‌లు చిమ్ముతూ బ్లాస్ట్ అయ్యేందుకు రెడీగా ఉన్న దృశ్యాన్ని కూడా పీసీ క్యాప్చుర్ చేసింది. ఆ పోస్ట్ కి ``టోర్మినా నా ???? మరియు ???? నా ద్వారా`` అని శీర్షిక‌ను రాసింది. ప్రియాంక చోప్రా రాక‌తో సిసిలీ మరింత వేడిగా మ‌రుగుతోంది! అని జోక్ చేయగా, మరొకరు ``ఎప్పటిలాగే చంపడం, క్వీన్ పీసీ ప్ర‌త్యేక‌త‌! అని పొగిడేసాడు. దేశీ గాళ్ దులిపేస్తుంద‌ని కొంద‌రు ప్రేమ‌ను వ్య‌క్తం చేసారు.


ప్రియాంక చోప్రా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. హాలీవుడ్ లో జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో కలిసి ఆమె నటించిన `హెడ్స్ ఆఫ్ స్టేట్` జూలై 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. అలాగే `ది బ్లఫ్ సినిమాలోను న‌టిస్తోంది. సిటాడెల్ సీజన్ 2 పనిని ఇప్ప‌టికే పీసీ పూర్తి చేసింది. రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబుతో కలిసి జంగిల్ అడ్వెంచర్ మూవీ చిత్రీకరణలో కూడా బిజీగా ఉంది.