బీచ్ బికినీ క్వీన్ హొయలు చూసారా?
బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో నిరంతరం చిల్ చేస్తుంది నేహాశర్మ. ఈ బ్యూటీ సినిమాలతో కంటే, షికార్లతోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తోంది.
By: Tupaki Desk | 20 April 2025 10:42 PM ISTబికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో నిరంతరం చిల్ చేస్తుంది నేహాశర్మ. ఈ బ్యూటీ సినిమాలతో కంటే, షికార్లతోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తోంది. కెరీర్ పరంగా ఆశించిన పరిణతి లేకపోయినా కానీ, నిరంతరం సోషల్ మీడియాల్లో విజువల్ ట్రీట్ తో అలరిస్తోంది. నేహాశర్మ వరుస ఫోటోషూట్లు , వీడియో షూట్లు ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదం పంచుతున్నాయి.
తాజాగా మరోసారి బికినీలో చెలరేగిపోయింది. ఈ ఆదివారం సూర్యుని ఎండలో ఇలా గడిపాను! అంటూ చాలా ఫోజులు కొట్టింది. ఒంటరి ద్వీపంలో శర్మా గాళ్ బికినీ ఫోజులు ప్రస్తుతం యూత్ లో వైరల్ గా మారాయి. నేహా శర్మ మాల్దీవుల నుండి తన అద్భుతమైన వెకేషన్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా హీట్‌ను పెంచుతోంది.
ఎంపిక చేసిన పాస్టెల్ బికినీపై లైమ్-గ్రీన్ కో-ఆర్డ్ సెట్ అద్భుతంగా కనిపిస్తోంది. అలా ఎండలో నడుస్తూ, తాటి చెట్టు కింద పోజులిచ్చినా .. బీచ్ ఇసుక లో చెప్పులు లేకుండా నడిచినా, బికినీలో గ్లామర్‌ను చిందింది. ఎండలో ప్రశాంతమైన ఆదివారాన్ని నచ్చినట్టు ఆనందించడంలోనే కాదు... వీక్షకులను సంతుష్టులను చేయడంలోను ఎక్కడా తగ్గడం లేదు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... క్రూక్, క్యా సూపర్ కూల్ హై హమ్, తుమ్ బిన్ 2 లాంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. బాలీవుడ్‌లోకి నటిగా అడుగుపెట్టే ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇటీవల నేహా కొన్ని సినిమాల్లో నటించినా అవేవీ విజయం సాధించలేదు. దీంతో రేసులో వెనకబడింది. హేరాఫేరి 3 కాస్టింగ్ లో చేరినా ఈ సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యమైన సంగతి తెలిసిందే.