వీడియో: మృణాల్ క్రేజ్ మైండ్ బ్లాంక్
ఈ రెండో సందర్భం చాలా అనూహ్యమైనది. దీనిని సాధించే ముందు మొదటి సన్నివేశాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 8 April 2025 9:23 AM ISTఎవరైనా నటి అలా రెడ్ కార్పెట్ పై వాక్ చేస్తుంటే, అక్కడ మీడియా కానీ, ప్రజలు కానీ పట్టించుకోకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి...
అదే సమయంలో ఎవరైనా నటి రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే, తన వెంటపడి విసిగిస్తూ, ఫోటో ఫ్లాష్‌లు మెరిపిస్తూ తనతో సరదాగా జోవియల్ గా మాట్లాడేస్తూ హంగామా సృష్టిస్తుంటే ఆ సీన్ ఎలా ఉంటుందో ఊహించండి.. ఈ రెండు సందర్భాలను ఈ నటి ఎదుర్కొంది.
ఈ రెండో సందర్భం చాలా అనూహ్యమైనది. దీనిని సాధించే ముందు మొదటి సన్నివేశాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్యాలెంటెడ్ మృణాల్ ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని నిలదొక్కుకుంది. పరిశ్రమలో కెరీర్ ఆరంభం తనను ఎవరూ గుర్తించలేదు. నిర్మాతలు అవకాశాలివ్వలేదు. కానీ పట్టువదలని విక్రమార్కుని సోదరిలా చాలా ప్రయత్నించింది. చివరికి కెరీర్ లో ఆశించిన విజయాల్ని అందుకుని తనను తాను నటిగా నిరూపించుకుని ఒక్కో మెట్టు ఎదుగుతూనే ఉంది.
సీతారామం, హాయ్ నాన్న లాంటి బ్లాక్ బస్టర్లతో పాటు, కల్కి 2898 ఏడిలో చిన్న పాటి గ్లింప్స్ లో కనిపించింది మృణాల్. ఈ భామ తదుపరి ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మృణాల్ ఎందుకనో స్తబ్ధుగా ఉంది. కానీ ఇంతలోనే మడాక్ ఫిలింస్ ఏర్పాటు చేసిన భారీ ఈవెంట్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈవెంట్ కి వస్తుండగానే మృణాల్ వెంటపడిన ఫోటోగ్రాఫర్లు నానా రచ్చ చేసారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మడాక్ ఫిలింస్ బాలీవుడ్ లో కొన్నేళ్లుగా హవా సాగిస్తోంది. ఇటీవల స్త్రీ 2 లాంటి సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుస బ్లాక్ బస్టర్లను అందిస్తూ, స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా నిర్మాణ సంస్థ దూసుకెళుతోంది. పాపలర్ మడాక్ ఫిలింస్ బ్యానర్ లో నటించే ప్రతి స్టార్ ఈ వేడుకకు విచ్చేసారు. ఈ సందర్భంగా స్టార్లతో సెలబ్రేషన్ హాట్ టాపిగ్గా మారింది.
