Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స‌ముద్రంలో సైర‌న్ మోగించిన కృతి!

వ‌రుస‌గా కెరీర్ బెస్ట్ సినిమాల‌తో జోరు మీద ఉంది కృతి స‌నోన్. జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డ్ అందుకున్న త‌ర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఎంపిక ప‌రంగా మ‌రింత జాగ్ర‌త్త వ‌హిస్తోంది.

By:  Tupaki Desk   |   21 July 2025 4:00 AM IST
ఫోటో స్టోరి: స‌ముద్రంలో సైర‌న్ మోగించిన కృతి!
X

వ‌రుస‌గా కెరీర్ బెస్ట్ సినిమాల‌తో జోరు మీద ఉంది కృతి స‌నోన్. జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డ్ అందుకున్న త‌ర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఎంపిక ప‌రంగా మ‌రింత జాగ్ర‌త్త వ‌హిస్తోంది. క్రూ లాంటి క‌మ‌ర్షియ‌ల్ కంటెంట్ ఉన్న సినిమాలో న‌టించిన కృతి స‌నోన్ దోప‌ట్టి లాంటి క‌ల్ట్ సినిమాతోను మెప్పించింది.


సినిమాల కోసం సెట్ల‌లో కుస్తీలు ప‌డుతూ అల‌సిపోతున్న శ‌రీరానికి కాస్తంత సాంత్వ‌న కూడా అవ‌స‌రం. అందుకే వీలున్న ప్ర‌తిసారీ బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ లో చిల్ అవుతూనే ఉంది. ఆదివారం మ‌రోసారి కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రూయిజ్ షిప్‌లో త‌న వెకేషన్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది.


ఈ ఫోటోగ్రాఫ్ లో కృతి రంగురంగుల డిజైన‌ర్ బికినీలో కనిపించింది. చుట్టూ బ్లూ సీ, క్రూయిజ్ పై భారీ సెట‌ప్, రుచిక‌ర‌మైన వంట‌కాల ఆస్వాధ‌న‌, వైవిధ్య‌మైన‌ ఫోటోషూట్లు.. ఇలా రోజంతా చిల్లింగ్ గా గడిచిపోయింది. ఇంతటి ఆనందక‌ర‌ స‌మ‌యంలో కృతి ఒక అంద‌మైన క‌వితను కూడా రాసింది. ''ఉప్పు పట్టిన‌ జుట్టు.. నా హృదయంలో ఇంద్రధనస్సు... అలలతో ప్రవహిస్తోంది.. పోస్ట్‌కార్డ్ సూర్యాస్తమయాలు!! అంటూ అంద‌మైన క‌విత‌ను శీర్షికలో రాసింది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. 1 నేనొక్క‌డినే, దోచేయ్, ఆదిపురుష్ లాంటి చిత్రాల‌తో తెలుగు ఆడియెన్ కి బాగా చేరువైన కృతి ప్ర‌స్తుతానికి బాలీవుడ్ లో మాత్ర‌మే న‌టిస్తోంది. మోస్ట్ అవైటెడ్ `తేరే ఇష్క్ మే` షూటింగ్‌ను ఇటీవ‌లే ముగించింది. త‌దుప‌రి ర‌ణ్ వీర్ డాన్ 3లో న‌టించ‌నుంద‌ని వార్త‌లొస్తున్నాయి. కానీ అధికారికంగా దీనిని ప్ర‌క‌టించాల్సి ఉంది.