కియరా బికినీ సోయగాలు మైండ్ బ్లాక్
ఇదే సమయంలో కియరా నటించిన క్రేజీ చిత్రం 'వార్ 2' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో హృతిక్ సరసన కియరా నటించింది.
By: Sivaji Kontham | 31 July 2025 10:00 PM ISTఅందాల ఆరబోతలో నేటితరం కథానాయికలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. బాలీవుడ్‌లో చాలామంది యువకథానాయికలు బికినీ షోలతో దుమ్ము రేపుతున్నారు. నటవారసురాళ్లుగా బరిలోకి దిగిన భామలు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఈతరంలో ఎవరికీ తీసిపోని అందం కియరా అద్వాణీ సొంతం. సాంప్రదాయ చీరకట్టు అయినా, డిజైనర్ లెహంగాల్లో అయినా, లేదా బికినీలు మోనోకినిల్లో అయినా కియరా దివ్యమైన రూపం కుర్రకారు హృదయాల్లో గిలిగింతలు పెడుతోంది.
బాలీవుడ్‌లో ప్రముఖ నటగురువు వద్ద శిక్షణ తీసుకుని మరీ బరిలోకి దిగిన కియరా తొలిగా టాలీవుడ్ లో కథానాయికగా నిరూపించుకుని, అటుపై బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇరు పరిశ్రమల్లోను కియరా క్రేజ్ ఉన్న కథానాయికగా ఎదిగింది. ఇంతలోనే స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తోంది. ఇటీవలే కియరా ఒక బిడ్డకు జన్మనిచ్చి మామ్ అయిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో కియరా నటించిన క్రేజీ చిత్రం `వార్ 2` విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో హృతిక్ సరసన కియరా నటించింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శంకర్ - చరణ్ కాంబినేషన్ లో వచ్చిన 'గేమ్ ఛేంజర్' తర్వాత కియరాకు ఇది మరో భారీ పాన్ ఇండియన్ చిత్రం. ఇందులో ఈ బ్యూటీ గ్లామరస్ రోల్ లో మెరుపులు మెరిపించనుంది. అంతేకాదు ఈ సినిమాలో `ఆవన్ జావన్..` అంటూ సాగే పాటలో కియరా బికినీ సోయగాలు మతులు చెడగొట్టడం ఖాయమని గుసగుస వినిపిస్తోంది. ట్రైలర్ గ్లింప్స్ లో కియరా నియాన్ గ్రీన్ బికినీలో కొన్ని సెకన్ల పాటు గడగడ లాడించింది. తాజాగా ఈ పాట టీజర్ విడుదలైంది.
'వార్ 2' మొదటి సింగిల్ త్వరలో విడుదల కానుంది. తాజాగా రిలీజైన టీజర్‌లో హృతిక్ రోషన్ & కియారా అద్వానీల నడుమ రొమాన్స్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆవన్ జావన్ పాటను అర్జిత్ సింగ్ -నిఖితా గాంధీ పాడారు. ప్రీతమ్ సంగీతం అందించగా, అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య భీకరమైన `వార్`ని చూపిస్తూనే, ఒక ఛమక్కులాంటి యాక్షన్ సీక్వెన్స్ లో కియరా స్టంట్స్ ని కూడా చూపించారు. అందుకు విరుద్ధంగా ట్రైలర్ లోని ఒక సాంగ్ బిట్‌లో బికినీలో ఛమక్కున మెరిపించింది ఈ బ్యూటీ. `వార్ 2` ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. హృతిక్ వర్సెస్ తారక్ వార్ ఎలా ఉండబోతోందో వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్‌గా వేచి చూస్తున్నారు.
