పిక్‌టాక్ : మోడ్రన్ వధువుగా శ్రీదేవి కూతురు
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఇప్పటికే సెటిల్ కాగా చిన్నమ్మాయి ఖుషి కపూర్ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తుంది.
By: Tupaki Desk | 11 April 2025 3:00 PM ISTతెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు శ్రీదేవి. దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుని, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ఎన్టీఆర్‌కి జోడీగా దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. గతంలో చిరంజీవి, శ్రీదేవి జోడీని చూసిన ప్రేక్షకులు ఇప్పుడు రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీని చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఇప్పటికే సెటిల్ కాగా చిన్నమ్మాయి ఖుషి కపూర్ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఈమె సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ది ఆర్చీస్, లవ్‌యాపా, నదానియన్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్క జాన్వీ కపూర్ మాదిరిగానే ఖుషి కపూర్‌కి సక్సెస్‌లు వెంట వెంటనే దక్కడం లేదు. బాలీవుడ్‌లో బ్రేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఖుషి కపూర్ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా స్టార్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. ఈసారి ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది.
మానిఫెస్ట్ కవర్ పేజ్‌పై ఖుషీ కపూర్ మోడ్రన్ వధువుగా కనిపించింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో పాటు, గ్రీన్ స్టోన్స్‌ను కలిగిన నెక్ హారంను ధరించి, అంతకు మించి మోడ్రన్ ఔట్ ఫిట్‌ను ధరించింది. సాధారణంగానే అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఈ అమ్మడు తాజా ఫోటోలతో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఖుషి కపూర్ అక్క జాన్వీ కపూర్‌కి ఏమాత్రం తగ్గలేదు. రెండు మూడు ఏళ్ల క్రితం ఖుషి కపూర్ హీరోయిన్‌గా సెట్ కాదు అని విమర్శలు చేసిన వారే ఇప్పుడు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్‌లో చాలా మందితో పోల్చితే ఖుషి కపూర్ బెస్ట్ హీరోయిన్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
న్యూయార్క్‌లోని ఫిల్మ్ అకాడమీలో సంవత్సరం పాటు నటన కోర్స్ చేసిన ఖుషి కపూర్ నటనతో ఇప్పటి వరకు నటించిన ప్రతి సినిమాలోనూ అలరించింది. కానీ లక్ కలిసి రాకపోవడంతో సినిమాలు హిట్ కావడం లేదు. అక్క జాన్వీ కపూర్ ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని ఆకట్టుకుందో, ఆఫర్లు దక్కించుకుందో అలాగే ఈ అమ్మడు అందమైన ఫోటోలతో అలరిస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడు తన అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతోంది. ముందు ముందు కూడా ఈమె నటిగా రాణించాలంటే ఇలాంటి అందమైన ఫోటో షూట్స్, కవర్ స్టిల్స్ తప్పనిసరి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
